రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తెరాస కార్యకర్తల చేతుల్లో దాడులకు గురైన బీజేపీ కార్యకర్తలను పరామర్శించేందుకు వెళ్తున్న ఎమ్మెల్యే రాజాసింగ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. గాయపడ్డ బీజేపీ కార్యకర్తలను కలిసేందుకు వెళ్తున్న తనను అక్రమంగా పోలీసులు నిర్బంధించడంపై మండిపడ్డారు ఎమ్మెల్యే రాజాసింగ్. పోలీస్ స్టేషన్లో తమ కార్యకర్తలపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి పాల్పడితే పట్టించుకోలేదన్నారు. వారిని కలిసేందుకు వెళ్తున్న క్రమంలో పోలీసులు ఆపడం అప్రజాస్వామికమని రాజాసింగ్ అన్నారు. మాజీమంత్రి చంద్రశేఖర్, సంగప్పతో కలిసి ఎల్లారెడ్డిపేటకు వెళ్తున్న…