Lightning Strike In Uttar pradesh, Madhya pradesh: మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో పిడుగుపాటులో పలువురు మరణించారు. మధ్యప్రదేశ్ లోని విదిశా, సత్నా, గుణ జిల్లాల్లో గత 24 గంటల్లో 9 మంది మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు. విదిశా జిల్లాలోని గంజ్ బాసోడా తహసీల్ పరిధిలోని అగసోడ్ గ్రామంలో వర్షం వస్తుందని చెట్టుకింద నిల్చున్న నలుగురు వ్యక్తులపై పిడుగు పడింది. దీంతో వారంతా అక్కడిక్కడే మరణించారు. చ