దొంగలు రెచ్చిపోతున్నారు. అదను చూసి, మాటువేసి మాయ చేస్తున్నారు. హైదరాబాద్ లో జరిగిన దారిదోపిడీ పోలీసులకు సవాల్ విసురుతోంది. బహదూర్‌పురా పోలీస్ స్టేషన్ పరిధిలో 10లక్షల రూపాయల దారి దోపిడీ జరిగింది. పురానాపూల్ రోడ్డులో 10 లక్షల రూపాయలతో వెళుతున్న ఓ వ్యక్తి దృష్టి మరల్చి దోపిడీకి పాల్పడ్డారు ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు. ఓ బైక్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు వ్యక్తి చేతిలోని 10లక్షల రూపాయల బ్యాగ్ ఎత్తుకెళ్లారు. దీంతో బహదూర్ పుర పోలీస్ స్టేషన్…