కరోనాపై పోరాటంలో దేశం మైలురాయిని అధిగమించింది. ఇంతింతై వటుడింతై అన్నట్టుగా.. 100 కోట్ల డోసుల్ని దేశం దాటేసింది. ఎన్నో అవాంతరాలను దాటుకుని వాక్సినేషన్ ప్రక్రియలో ప్రపంచానికే ఆదర్శంగా నిలిచింది. ఈ ఘనతకు కారకులైన ప్రధాన మంత్రి మోడీకి ధన్యవాదాలు అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఈ మేరకు పవన్ వీడియో విడుదల చేశారు. కోవిడ్ వాక్సినేషన్ ప్రక్రియ 100 కోట్ల డోసుల మార్క్ దాటడం ప్రతి ఒక్కరం హర్షించాల్సిన మైలు రాయి. ప్రధాన మంత్రి నరేంద్ర…