తమిళ యంగ్ స్టార్ హీరో శింబు నటించిన ‘ఈశ్వరన్’ ఈ యేడాది సంక్రాంతి కానుకగా తమిళంలో విడుదలైంది. అనివార్య కారణాలతో తెలుగు వర్షన్ మాత్రం వాయిదా పడింది. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని మాతం సాధించలేదు. దాంతో శింబు కొత్త సినిమాల కోసం అభిమానులు ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. శింబు ప్రస్తుతం ‘మానాడు’లో నటిస్తున్నాడు. ఈ యాక్షన్ ప్యాక్డ్ ప్రాజెక్ట్ పై చాలామంది ఆశలు పెట్టుకున్నారు. ఇక చాలా కాలంగా విడుదల కాకుండా ఆగిన ‘మహా’…