గత వారం పదహారు చిత్రాలతో సందడి చేసిన ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈ శుక్రవారం మరో రెండు చిత్రాలను స్ట్రీమింగ్ చేయబోతోంది. అందులో ఒకటి స్ట్రయిట్ తెలుగు సినిమా ‘ఒక చిన్న విరామం’ కాగా, మరొకటి తమిళ అనువాద చిత్రం ‘విక్రమార్కుడు’. సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ మూవీ ‘ఒక చిన్న విరామం’లో పునర్నవి భూపాలం, గరిమ, నవీన్ నేని ముఖ్యపాత్రలు పోషించారు. దీన్ని స్వీయ దర్శకత్వంలో సుదీప్ చెగూరి నిర్మించారు. కథ విషయానికి వస్తే బిజినెస్…