భారత స్టార్ పేసర్ మొహ్మద్ షమీ పై సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్న విషయం తెలిసిందే. అయితే గత ఆదివారం జరిగిన మ్యాచ్ లో పాకిస్థాన్ జట్టు విజయం సాధించింది. అయితే ఆ గెలుపు కోసం కావాల్సిన చివరి పరుగులను షమీ ఓవర్లోనే కొట్టింది పాక్. దాంతో భారత అభిమానులు కొందరు షమీని ట్రోల్ చేసారు. అయితే అది తప్పు అని చెప్తూ ఇప్పటికే మేము షమీకి మద్దతు ఇస్తున్నాము అని బీసీసీఐ, సచిన్, అనిల్ కుంబ్లే, సెహ్వాగ్ తో సహా చాలా మంది ఆటగాళ్లు అభిమానులు పోస్ట్స్ చేసారు. ఇక తాజాగా ఆ లిస్ట్ లో భారత మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ కూడా చేరాడు. తాజాగా యువీ తన ట్విటర్ లో ”మనందరికీ మైదానంలో కఠినమైన రోజులు ఉన్నాయి, కానీ అందులో ఒక రోజు మిమ్మల్ని చెడ్డ క్రీడాకారుడిగా నిర్వచించదు! దేశం కోసం మీరు సాధించింది చూస్తే గర్వంగా ఉంది అని ట్విట్ చేసాడు.