NTV Telugu Site icon

IND vs PAK: భారత్- పాకిస్తాన్ మధ్య బ్లాక్‌బస్టర్ పోరు.. అద్భుతమైన ప్రదర్శన చేసేది వీళ్లే..!

Ind Vs Pak

Ind Vs Pak

IND vs PAK: మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న ఛాంపియన్స్‌ ట్రోఫీ కోసం భారత జట్టు రెడీ అవుతుంది. ఇక, ఈ మెగా టోర్నీలో భాగంగా చిరకాల ప్రత్యర్థుల మధ్య జరిగే మ్యాచ్‌ కోసం వరల్డ్ వైడ్ గా అభిమానులు ఎదురు చూస్తున్నారు. కేవలం, ఐసీసీ టోర్నీల్లోనే తలపడే ఈ రెండు జట్ల మధ్య పోరు ఎంతో రసవత్తరంగా కొనసాగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ నెల 23వ తేదీన దుబాయ్‌ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌పై పలువురు మాజీలు తమ అంచనాలను వెల్లడిస్తున్నారు. తాజాగా ఇరు జట్లకు చెందిన మాజీ క్రికెటర్లు ఓ టీవీ షోలో పాల్గొన్నారు.

Read Also: GHMC: ఎంఐఎం మద్దతుతో కాంగ్రెస్ స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు సిద్ధం కానుందా!

ఈ సందర్భంగా దాయాదుల మధ్య జరిగే బ్లాక్ బస్టర్ పోరులో గొప్ప ప్రదర్శన చేసే ప్లేయర్స్ ఎవరో టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్, పాక్‌ మాజీ కెప్టెన్లు ఇంజమామ్‌, షాహిద్‌ అఫ్రిదీ తెలియజేశారు. ఈ మ్యాచ్‌లో భారత్‌ తరఫున శుభ్‌మన్‌ గిల్‌ అత్యధిక రన్స్ చేస్తాడని.. అటు బౌలింగ్ లో మహమ్మద్‌ షమీఎక్కువ వికెట్లు తీస్తాడని యువీ పేర్కొనగా.. పాకిస్థాన్‌ వైపు బ్యాట్‌తో బాబర్‌ అజామ్‌ .. బాల్ తో షాహిన్‌ అఫ్రిదీ ఆకట్టుకుంటారని అఫ్రిదీ చెప్పుకొచ్చాడు. అయితే ఇంజమామ్‌ మాత్రం.. బాబర్‌తో పాటు హారిస్‌ రవూఫ్‌ పేరు చెప్పాడు.

Read Also: KA 10 : దిల్ రూబా సెకండ్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్

ఇక, మ్యాచ్‌ గెలుపులో కీలకంగా ఏ ప్లేయ్లు మారుతారన్న ప్రశ్నకు.. భారత్ తరపున హార్దిక్‌ పాండ్య పేరును యువరాజ్‌ చెప్పగా.. రిజ్వాన్‌ పేరును అఫ్రిదీ తెలిపగా.. ఇంజమామ్‌.. ఫకర్‌ జమాన్‌ పేరున సూచించాడు. అయితే, ఆదివారం జరిగబోయే ఈ మ్యాచ్‌లో ఏ జట్టు పైచేయి సాధిస్తుంది..? అని అడిగిన ప్రశ్నకు.. దుబాయ్‌ పరిస్థితుల ప్రకారం పాకిస్థాన్‌ వైపే యువీ మొగ్గు చూపాడు.

Read Also: KCR Birthday: కేసీఆర్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్

కాగా, ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీలో ఇప్పటి వరకు ఉన్న గణాంకాలను పరిశీలిస్తే.. ఇరు జట్లు ఐదుసార్లు పోటీ పడగా.. మూడు మ్యాచ్‌ల్లో పాక్ విజయం సాధించగా.. మరో రెండింట్లో భారత్‌ గెలిచింది. తాజాగా దుబాయ్‌ వేదికగా జరిగే మ్యాచ్‌లో రోహిత్‌ సేన విజయం సాధించి ఈ లెక్కను సరి చేయాలని ప్లాన్ చేస్తుంది. ఛాంపియన్స్‌ ట్రోఫీ ఈ నెల 19వ తేదీ నుంచి స్టార్ట్ కానుండగా.. ఫిబ్రవరి 23వ తేదీన పాకిస్థాన్‌తో మ్యాచ్‌ ఆడనుంది.