Yashasvi Jaiswal Creates Sensational Record In IPL: ఐపీఎల్ 2023 సీజన్‌లో సూపర్ ఫామ్ కొనసాగిస్తున్న రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ తాజాగా ఓ చరిత్ర సృష్టించాడు. శుక్రవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్థశతకంతో రాణించిన జైస్వాల్.. ఈ క్రమంలోనే 600 పరుగుల మార్క్‌ని దాటేశాడు. ఇలా ఒక సీజన్‌లో 600 పరుగుల మార్క్ అందుకున్న తొలి అన్‌క్యాప్‌డ్ (టీమిండియాకు ప్రాతినిధ్యం వహించకుండా) ప్లేయర్‌గా జైస్వాల్ నిలిచాడు. భారత్ తరపున ఈ 21 ఏళ్ల జైస్వాల్ ఒక్కడే ఈ ఘనతను సాధించాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకూ 14 మ్యాచ్‌లు ఆడిన జైస్వాల్ మొత్తం 625 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీతో పాటు ఐదు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఓవరాల్‌గా చూసుకుంటే.. ఒక సీజన్‌లో 600+ పరుగులు నమోదు చేసిన పిన్న వయస్కుల్లో రిషభ్ పంత్ (20 ఏళ్ల 226 రోజులు) తొలి స్థానంలో ఉన్నాడు. జైస్వాల్ (21 ఏళ్ల 142 రోజులు) రెండో స్థానంలో ఉండగా.. విరాట్ కోహ్లి(24 ఏళ్ల 193 రోజులు) మూడో స్థానంలో, రుతురాజ్ గైక్వాడ్ (24 ఏళ్ల 251 రోజులు) నాలుగో స్థానం, షాన్ మార్ష్(24 ఏళ్ల 282 రోజులు) ఐదో స్థానంలో నిలిచారు.
Bajrang Punia: బ్రిజ్‌భూషణ్ 15 రూపాయల వ్యాఖ్యలపై పూనియా స్ట్రాంగ్ కౌంటర్
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై రాజస్థాన్ జట్టు విజయం సాధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. అనంతరం 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ 19.4 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసి గెలుపొందింది. పడిక్కల్ (51), జైస్వాల్ (50) అర్థశతకాలతో రాణించడం.. షిమ్రాన్ హెట్‌మేయర్స్ (46) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో.. రాజస్థాన్ ఈ విజయాన్ని సొంతం చేసుకోగలిగింది. ఈ మ్యాచ్‌లో పడిక్కల్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు.
Janhvi Kapoor: ‘సాగర కన్య’గా మారిన అతిలోక సుందరి కూతురు…