Womens IPL: విమెన్స్ ఐపీఎల్ ఆరంభం అప్పుడే..ప్లేయర్ల వేలానికి డేట్ ఫిక్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న మహిళల ఐపీఎల్‌కు సంబంధించి చకచకా పనులు సాగుతున్నాయి. ఇప్పటికే టెండర్లు పిలిచి ఫ్రాంచైజీలను కూడా ఖరారు చేసింది మేనేజ్‌మెంట్. ఈ లీగ్‌లో పాల్గొనబోయే ఐదు టీమ్స్ ఏంటో తెలిపింది. ఈ నేపథ్యంలో డబ్ల్యూపీఎల్ మొదటి సీజన్‌ను మార్చి 4-24 మధ్య నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఐపీఎల్-15 సీజన్‌ను మార్చి 31 లేదా ఏప్రిల్ 1న ప్రారంభించి మే 28న ఫైనల్ నిర్వహించే అవకాశం ఉంది. అయితే, దీనిపై బీసీసీఐ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఫిబ్రవరి మొదటివారంలో మహిళల ఐపీఎల్‌కు సంబంధించిన ప్లేయర్ల వేలం నిర్వహించే అవకాశం ఉందని బీసీసీఐ కార్యదర్శి జై షా పేర్కొన్నారు. ఆటగాళ్లను కొనుగోలు చేయడానికి ఒక్కో జట్టు రూ.12 కోట్లు వెచ్చించాలి. ప్రతి జట్టు 15-18 మంది ఆటగాళ్లను కొనుగోలు చేయొచ్చు.
Renuka Singh: పేసర్ రేణుకకు ఐసీసీ అవార్డు..ఎంట్రీ ఇచ్చి ఏడాది కాకుండానే!
Also Read
- IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
- Virat Kohli: సంచలన ప్రకటన చేసిన కింగ్ కోహ్లీ.. ఇక, ఇదే లాస్ట్..!
- Asian Games 2026: ఆసియా క్రీడల్లో భారత ప్లేయర్ల హవా.. పాయింట్ల పట్టికలో పైపైకి..
- Asian Games 2026: మహిళల కబడ్డీలో భారత్ జయభేరి.. ఇరాన్‌పై ఉత్కంఠ విజయం.. గోల్డ్ మెడల్ కైవసం
కాగా, విమెన్స్ ఐపీఎల్లో పాల్గొనే ఐదు జట్ల కోసం నిర్వహించిన వేలం వివరాలను బీసీసీఐ బుధవారం సాయంత్రం వెల్లడించింది. ఐదు జట్ల ద్వారా రూ. 4670 కోట్ల భారీ మొత్తం సమకూరినట్లు పేర్కొంది. అహ్మదాబాద్ జట్టును అదానీ స్పోర్ట్స్‌లైన్ రూ.1,289 కోట్లకు, ముంబయి జట్టును ఇండియావిన్ స్పోర్ట్స్ రూ.913 కోట్లకు, బెంగళూరు జట్టును రాయల్ ఛాలెంజర్స్ స్పోర్ట్స్ రూ.901 కోట్లకు, దిల్లీ జట్టును జేఎస్‌డబ్ల్యూ జీఎంఆర్ క్రికెట్ రూ.810 కోట్లకు, లఖ్‌నవూ జట్టును కాప్రీ గ్లోబల్ హోల్డింగ్స్ రూ.757 కోట్లకు దక్కించుకున్నట్లు తెలిపింది.
అలాగే, ప్రసార హక్కుల ద్వారా సమకూరిన రూ. 951 కోట్లతో కలిపి.. ఒక్క బంతికూడా పడకుండానే మహిళల ప్రీమియర్ లీగ్ ద్వారా బోర్డు రూ. 5,650.99 కోట్ల రెవెన్యూ ఆర్జించినట్టయింది. కోల్‌కతా రూ. 666 కోట్ల బిడ్ వేసినా.. మిగతా పోటీదారులు అంతకంటే ఎక్కువ కోట్ చేశారు. దాఖలైన టెండర్లలో రాజస్థాన్ రాయల్స్ రూ. 180 కోట్ల బిడ్ అన్నింటికంటే అత్యల్పం. 2008లో ఐపీఎల్ టీమ్‌ల ద్వారా వచ్చిన దానికంటే ఈ మొత్తం ఎంతో ఎక్కువని బీసీసీఐ కార్యదర్శి జై షా చెప్పాడు.
తాజావార్తలు
-
OTR: పశ్చిమ గోదావరిలో వైసీపీకి ఏం జరుగుతోంది?
-
Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
-
AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
-
IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
-
Off The Record: రిజర్వేషన్ తేలకముందే జెడ్పీ రేస్!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?