Renuka Singh: పేసర్ రేణుకకు ఐసీసీ అవార్డు..ఎంట్రీ ఇచ్చి ఏడాది కాకుండానే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా మహిళా క్రికెటర్, యంగ్ సెన్సేషన్ రేణుకా సింగ్ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చి ఏడాది కూడా కాలేదు. అప్పుడే ప్రతిష్టాత్మక అవార్డులు అందుకుంటూ ఔరా అనిపిస్తోంది. భారత జట్టు వెటరన్ పేసర్ జులాన్ గోస్వామి రిటైర్మెంట్ తర్వాత ఆమె వారసురాలిగా జట్టులోకి వచ్చిన రేణుక.. అద్భుతమైన ప్రదర్శనలు చేస్తూ టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమెకు ఐసీసీ ఎమర్జింగ్ ఉమెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వరించింది. గతేడాది ఫిబ్రవరిలో భారత జట్టులోకి వచ్చిన ఈ హిమాచల్ ప్రదేశ్ అమ్మాయి.. 2022కుగానూ ఈ ఐసీసీ అవార్డును సొంతం చేసుకుంది. ఈ మేరకు ఐసీసీ ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది
KL Rahul: రాహుల్ పెళ్లి.. ధోనీ, కోహ్లీ ఏం గిఫ్ట్ ఇచ్చారంటే!
Also Read
- Jasprit Bumrah: బుమ్రా లాంటి బౌలర్ మళ్లీ దొరకడు.. ప్రత్యామ్నాయం లేదు.. కానీ..!
- Jasprit Bumrah: వన్డేలకు దూరంగా జస్పీత్ బుమ్రా.. టీమ్ మేనేజ్మెంట్ ప్లాన్ ఇదే..
- Yuvraj Singh: ఇప్పుడు కాదు.. 25 ఏళ్లుగా అయనకు అసిస్టెంట్‌నే!
- Sanju Samson: తిలక్ వర్మ వల్లనే మ్యాచ్ ఓడిపోయాం.. గెలిచే మ్యాచ్ అక్కడే చెడింది..
ఈ అవార్డు రేసులో ఆస్ట్రేలియాకు చెందిన డార్సీ బ్రౌన్, ఇంగ్లాండ్ క్రీడాకారిణి అలైస్ క్యాప్సీలతో పాటు తన సహచర క్రికెటర్ యాస్తికా భాటియాలు పోటీలో ఉన్నా.. రేణుకకే ఈ అవార్డు వరించింది. ఏడాదికాలంగా వన్డేలతో పాటు టీ20ల్లో భారత్ సాధించిన విజయాల్లో కీలక భూమిక పోషిస్తున్న రేణుకకు ఈ అవార్డు దక్కింది. గతేడాది ఫిబ్రవరి 18న న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో వన్డేల్లోకి ఎంట్రీ ఇచ్చిన రేణుక.. ఇప్పటివరకు 21 వన్డేల్లో 22 వికెట్లు తీసింది. మొత్తంగా 29 మ్యాచ్‌ల్లోనే 40 వికెట్లు సాధించింది. గతేడాది కామన్వెల్త్ గేమ్స్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో రేణుక వేసిన స్పెల్ ఓ సంచలనం. నాలుగు ఓవర్లు వేసిన ఆమె నలుగురు ఆసీస్ బ్యాటర్లను ఔట్ చేసి ఆ జట్టుకు భారీ షాకిచ్చింది. అనంతరం ఆమెకు ఎదురే లేకుండా పోయింది.
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఎల్ నినో ముప్పుపై అప్రమత్తంగా ఉండాలి.. సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
-
Kawasaki Z300 India Launch: Kawasaki Z300 భారత్‌లోకి.. ధర ఎంత? 296cc ఇంజిన్, ఫీచర్లు, లాంచ్ డేట్ వివరాలు!
-
Nithiin: ‘అలియాస్ రుక్మిణి’తోనైనా నితిన్ లెక్క సరిచేస్తాడా?
-
Special Summary Revision: SIR వివాదం మధ్య ఈసీ కీలక నిర్ణయం.. 17 రాష్ట్రాల్లో ఓటరు జాబితాల సవరణకు ఆదేశాలు!
-
Instant Noodle: ఇన్స్టంట్ నూడుల్స్ తినడంలో భారత్ రికార్డు..! చైనా, జపాన్, వియత్నాం స్థానాలివే..
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!