Women’s Asia Cup 2026: ఆసియా కప్‌లో టీమిండియా జోరు.. ఆ నలుగురే వల్లే ట్రోఫీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Women’s Asia Cup 2026 India: మహిళల ఆసియా కప్ 2026లో భారత్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. టోర్నమెంట్లో భారత క్రీడాకారిణులు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అద్భుతంగా రాణించి.. గణాంకాల్లో అగ్రస్థానాలను సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా ఓపెనర్ షఫాలీ వర్మ బ్యాటింగ్‌లో అదరగొట్టగా.. స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ బౌలింగ్‌లో నంబర్ వన్‌గా నిలిచింది. టోర్నమెంట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా షఫాలీ నిలిచింది. ఐదు మ్యాచ్‌ల్లో 236 పరుగులు చేసింది. అంతేకాకుండా అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్‌గానూ షఫాలీ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. టోర్నీలో ఆమె 11 సిక్సర్లు బాదింది.
మరోవైపు భారత వైస్ కెప్టెన్ స్మృతి మంధాన కూడా తనదైన ముద్ర వేసింది. ఐదు ఇన్నింగ్స్‌ల్లో 213 పరుగులు చేసిన మంధాన.. 10 సిక్సర్లతో అత్యధిక సిక్సర్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. షఫాలీ, మంధాన తర్వాత శ్రీలంక కెప్టెన్ చమరి అటపట్టు 99 పరుగులతో మూడో స్థానంలో ఉంది. పాకిస్థాన్‌కు చెందిన ఫాతిమా సనా 71 పరుగులతో నాలుగో స్థానంలో నిలిచింది. చమరి, ఫాతిమా చెరో నాలుగు సిక్సర్లు బాదారు. అత్యధిక సిక్సర్లు కొట్టిన టాప్-10 బ్యాటర్ల జాబితాలో భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, వికెట్ కీపర్ రిచా ఘోష్ కూడా చోటు దక్కించుకున్నారు. హర్మన్‌ప్రీత్ ఐదు మ్యాచ్‌ల్లో మూడు సిక్సర్లు కొట్టి ఐదో స్థానంలో ఉండగా.. రిచా ఘోష్ నాలుగు ఇన్నింగ్స్‌ల్లో మూడు సిక్సర్లతో ఆరో స్థానంలో నిలిచింది.
Also Read
- Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
- Ajit Agarkar Future: బీసీసీఐలో ‘కోల్డ్ వార్’..! అజిత్ అగార్కర్ పదవిపై ఉత్కంఠ.. 48 గంటల్లో కీలక నిర్ణయం..?
- Abhishek Sharma Records: రికార్డుల మోతమోగించిన అభిషేక్ శర్మ..!
- Harmanpreet Kaur: మీరే మాకు అతిపెద్ద బలం, మీ కోసం ఏదైనా చేస్తాం.. హర్మన్‌ప్రీత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
శ్రీలంక బ్యాటర్ హర్షిత సమరవిక్రమ 98 పరుగులతో పాటు రెండు సిక్సర్లు కొట్టి ఏడో స్థానంలో ఉంది. పాకిస్థాన్‌కు చెందిన షవ్వాల్ జుల్ఫికార్, బంగ్లాదేశ్ బ్యాటర్ షోర్నా అక్తర్, థాయ్‌లాండ్‌కు చెందిన నరుమోల్ చైవై కూడా రెండు సిక్సర్ల చొప్పున కొట్టి టాప్-10లో చోటు సంపాదించారు. ఇక బౌలింగ్ విభాగంలోనూ భారత క్రీడాకారిణులదే ఆధిపత్యం. స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ టోర్నమెంట్లో ఏకంగా 14 వికెట్లు పడగొట్టి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచింది. కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ భారత విజయాల్లో దీప్తి కీలక పాత్ర పోషించింది. యువ స్పిన్నర్ శ్రీ చరణి టోర్నమెంట్లో 12 వికెట్లు తీసి అత్యధిక వికెట్ల జాబితాలో రెండో స్థానాన్ని దక్కించుకుంది. యువ బౌలర్లు ప్రేమ రావత్, నందిని శర్మ కూడా చెరో ఏడు వికెట్లు తీసి తమ సత్తా చాటారు.
ఫాస్ట్ బౌలర్ క్రాంతి గౌడ్ నిరాశపరిచింది. ఐదు మ్యాచ్‌ల్లో కేవలం రెండు వికెట్లు మాత్రమే తీసింది. అయితే ఆమె ఎకానమీ రేట్ 4.69గా ఉండటం విశేషం. మహిళల ఆసియా కప్ 2026లో టీమిండియా బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ సత్తా చాటింది. షఫాలీ వర్మ, స్మృతి మంధాన బ్యాటింగ్‌లో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడగా.. దీప్తి శర్మ, శ్రీ చరణి వికెట్ల వేటలో ముందంజలో నిలిచారు. ఆసియా కప్‌లో భారత జట్టు ఎందుకు ఛాంపియన్‌గా నిలిచిందో ఈ గణాంకాలే స్పష్టంగా చెబుతున్నాయి.
తాజావార్తలు
-
Women’s Asia Cup 2026: ఆసియా కప్‌లో టీమిండియా జోరు.. ఆ నలుగురే వల్లే ట్రోఫీ!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Ajit Agarkar Future: బీసీసీఐలో ‘కోల్డ్ వార్’..! అజిత్ అగార్కర్ పదవిపై ఉత్కంఠ.. 48 గంటల్లో కీలక నిర్ణయం..?
-
Bushra Bano: ‘అస్సలాము అలైకుమ్, ఇన్షా అల్లా, జజాకల్లాహ్” అంటూ మతపరమైన వ్యాఖ్యలు చేసిన IPS.. ఫిర్యాదు దాఖలు.!
-
Bethlehem Kudumba Unit: ‘లోకా: చాప్టర్ 1’ రికార్డ్ బద్దలు.. మలయాళంలో నంబర్ 1గా నివిన్ పౌలీ సినిమా!
ట్రెండింగ్
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?