సొంతగడ్డపై జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో భారత్ బోణీ కొట్టింది. గౌహతిలోని బర్సపారా క్రికెట్ స్టేడియంలో మంగళవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 59 పరుగుల తేడాతో గెలిచింది. వర్షం కారణంగా 47 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 8 వికెట్లకు 269 పరుగులు సాధించింది. లక్ష్యాన్ని 271 పరుగులకు సవరించగా.. శ్రీలంక 45.4 ఓవర్లలో 211 పరుగులకే ఆలౌట్ అయింది. ప్రపంచకప్‌లో శుభారంభం చేసిన భారత్.. తన…
ఆసియా కప్ 2025 ముగిసిందని క్రికెట్ అభిమానులు చింతించాల్సిన అవసరం లేదు. నేటి నుంచే మహిళల వన్డే ప్రపంచకప్ 2025 ఆరంభం అవుతోంది. భారత్ ఆతిథ్యమిస్తున్న మెగా టోర్నీ గువాహటిలో ఆరంభం కానుంది. తొలి మ్యాచ్‌లో శ్రీలంకను భారత్ ఢీకొట్టనుంది. సొంతగడ్డపై మెగా క్రికెట్ టోర్నీ జరుగుతుండడం, ఇటీవల ప్రదర్శన మెరుగ్గా ఉండడంతో టీమిండియాపై అంచనాలు భారీగా ఉన్నాయి. రెండుసార్లు ఫైనల్ చేరినా విజేతగా నిలవని భారత జట్టు.. ఈసారైనా సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతుందా? అన్నది చూడాలి.…
Tri Series: శ్రీలంక వేదికగా జరిగిన మహిళల మూడు జట్ల వన్డే ట్రై సిరీస్ ఫైనల్లో భారత మహిళల జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. నేడు కొలంబో (ఆర్‌పిఎస్) స్టేడియంలో శ్రీలంక మహిళల జట్టుతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ 97 పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 342 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ స్మృతి మందాన…
మలేసియా వేదికగా జరుగుతున్న అండర్-19 టీ20 ప్రపంచకప్ 2025లో భారత అమ్మాయిలు దూసుకుపోతున్నారు. గ్రూప్-ఎలో ఉన్న భారత్.. వెస్టిండీస్, మలేసియా జట్లపై విజయం సాధించింది. నేడు కౌలాలంపూర్ వేదికగా శ్రీలంకతో తలపడవుతోంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టాన్ని 118 పరుగులు చేసింది. తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష తృటిలో హాఫ్ సెంచరీ మిస్ చేసుకుంది. 44 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సుతో 49 రన్స్…
శ్రీలంకపై విజయం మాత్రమే లక్ష్యంగా తాము బరిలోకి దిగలేదని, నెట్ రన్‌రేట్‌ను మెరుగుపర్చుకునేలా ఆడాలనుకున్నాం అని భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తెలిపారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు బ్యాటింగ్ చేయడంపై చర్చించుకున్నామని, కనీసం 7-8 రన్‌రేట్ కంటే ఎక్కువగా పరుగులు చేయాలని భావించామని చెప్పారు. శ్రీలంకపై భారీ మార్జిన్‌తో గెలినప్పుడే నెట్‌రన్‌రేట్ పెరిగే అవకాశం ఉంటుందని, అందుకే రన్‌రేట్‌పైనా దృష్టిపెట్టామని హర్మన్‌ప్రీత్ చెప్పుకొచ్చారు. మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా బుధవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 82 పరుగుల…