కరోనా మహమ్మారీ వచ్చిన నాటి నుంచి నేటివరకు కూడా ల్యాప్ టాప్ వినియోగం బాగా పెరిగిపోయింది.. పెద్ద పెద్ద కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వడం.. అలాగే విద్యార్థులకు కూడా ఆన్ లైన్ క్లాసులు ఉండటంతో ఎక్కువ మంది ల్యాప్ టాప్ లను వాడుతూ వచ్చారు.. డైలీ వాడే వస్తువులలో ఇది కూడా ఒక భాగం అయ్యింది.. అందుకే మార్కెట్ లో వీటికి డిమాండ్ కూడా ఎక్కువగా ఉంది.. అయితే ల్యాప్ టాప్ లను ఎక్కువగా వాడటం వల్ల చార్జింగ్ త్వరగా అయిపోతుందని చాలా మంది ఇబ్బంది పడేవారు.. కొన్ని టిప్స్ పాటిస్తే అస్సలు చార్జింగ్ అవ్వదని అంటున్నారు.. ఇక ఆలస్యం ఎందుకు ఆ టిప్స్ ఏంటో ఒకసారి చూసేద్దాం పదండీ..
*. ల్యాప్ టాప్ చార్జింగ్ ఎక్కువ సమయం రావాలంటే విండోస్ 10లో పవర్ సేవింగ్ సెట్టింగ్స్‌ను మార్చాలి. స్టార్ట్ సెర్చ్ బార్‌లో పవర్ సేవర్ అని టైప్ చేస్తే పవర్ ఆప్షన్ కనిపిస్తుంటుంది.. అలాగే మానిటర్ పవరింగ్ ఆఫ్, స్లీప్ మోడ్‌కు త్వరగా వెళ్లడం లాంటి ఆప్షన్లు ఉంటాయి. అదేవిధంగా టాస్క్‌బార్ లోని బ్యాటరీని ఐకాన్ పై క్లిక్ చేసి పవర్ అని టైప్ చేయడంతో ఆప్షన్స్ కనిపిస్తాయి. మానిటర్ పవరింగ్ ఆఫ్, స్లీప్ మోడ్‌కు త్వరగా వెళ్లడం లాంటి ఆప్షన్లుంటాయి.. ఇక పవర్ సేవర్ ను కూడా సెట్ చేసుకోవడం ముఖ్యం..
*. ఇక ల్యాప్‌టాప్ చార్జింగ్ ఎక్కువ సేపు రావాలంటే డిప్ స్క్రీన్ వాడాలి. ఫుల్ బ్రెయిటనెస్ పెడితే త్వరగా చార్జింగ్ అయిపోయే అవకాశం ఉంది. అందుకే బ్యాటరీ ఎక్కువ సేపు రావాలంటే ట్యాబ్‌లలో స్క్రీన్ బ్రైట్‌నెస్ తగ్గించుకోవాలి… ఫోన్లో కూడా అంతేకదా..
*. వైఫై, బ్లాటూత్ లాంటి వాటిని అవసరం లేకుంటే మాత్రం వెంటనే ఆఫ్ చెయ్యాలి లేకుంటే మాత్రం చార్జింగ్ ఆంఫట్ అవుతుంది..
*. చాలా మంది ల్యాప్‌టాప్‌లకు మౌస్, ఎక్స్‌టర్నల్ కీ బోర్డులు వాడుతుంటారు. ఎక్స్‌టర్నల్ హార్డ్ డ్రైవ్‌లు, వెబ్‌క్యామ్ వినియోగిస్తుంటారు. అవసరమైపోయాక వాటిని తీసేయ్యడం మంచిది..
*.చార్జింగ్ పూర్తిగా అవ్వక ముందే చార్జింగ్ పెట్టాలి.. ఫుల్ అయ్యాక తీసెయ్యాలి.. ఎక్కువగా అప్డేట్స్ ను తీసుకోవడం కూడా అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు..