Wasim Jaffer On Shuman Gill: బంగ్లాదేశ్ తో జరగుతున్న మొదటి టెస్టు మ్యాచులో భారత్ పట్టు బిగించింది. మూడో రోజు భారత రెండో ఇన్నింగ్స్ లో ఛతేశ్వర పూజారా, శుభ్‌మాన్ గిల్ సెంచరీలు చేశారు. 152 బంతుల్లో 110 పరుగులు చేశాడు గిల్. తొలిసారిగా టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు. ప్రస్తుతం అతడిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. మాజీ స్టార్ క్రికెటర్ వసీం జాఫర్ శుభ్ మాన్ గిల్ పై ప్రశంసలు కురిపించారు. విరాట్ కోహ్లీ తర్వాత భారత్ తరుపుత బిగ్ బ్యాట్స్‌మెన్ అవుతాడంటూ అంచానా వేశారు.
Read Also: Dil Raju: కొత్త ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసిన దిల్ రాజు.. నిర్మాతలు ఎవరంటే..?
ప్రపంచంలో అత్యుత్తమ వర్తమాన బ్యాటర్లలో శుభ్ మాన్ గిల్ ఒకరని.. మూడు ఫార్మాట్లలో దేనిలో అయినా భారత జట్టుకు రెగ్యులర్ గా మారడానికి ముందు తనకంటూ ఓ పేరు తెచ్చుకున్నాడని అన్నాడు. శుక్రవారం బంగ్లాదేశ్ తో రెండో ఇన్నింగ్స్ లో తొలి టెస్ట్ సెంచరీ సాధించం ద్వారా తాను ఆల్ ఫార్మాట్ ఆటగాడినని నిరూపించుకున్నాడని వసీం జాఫర్ అన్నారు. రాబోయే కాలంలో అతడికి మంచి భవిష్యత్తు ఉందని అన్నాడు. ఆధునిక కాలంలో విరాట్ కోహ్లీని గొప్ప ఆటగాడిగా అంతా భావిస్తారు. అంతకుముందు సచిన్ ఈ ఘటన సాధించారు. బ్యాట్ తో సచిన్ తెండూల్కర్ కు చేరవ అయింది కోహ్లీ మాత్రమే అని జాఫర్ అన్నాడు. భారత్ నుంచి వీరి తర్వాత శుభ్ మాన్ గిల్ స్టార్ క్రికెటర్ అవుతారని భావిస్తున్నట్లు వెల్లడించారు.
వన్డేల్లో రోహిత్ శర్మకు గాయం కావడం వల్ల కేఎల్ రాహుల్ తో కలిసి శుభ్ మాన్ గిల్ ఇన్నింగ్స్ ప్రారంభించాడు. అయితే రోహిత్ వస్తే గిల్ మిడిల్ ఆర్డర్ లో కూడా ఆడగలడని వసీం జాఫర్ అన్నారు. గిల్, ఛతేశ్వర్ పూజారాల సెంచరీలతో మొదటిటెస్టులో భారత్ పట్టుబిగించింది. బంగ్లాదేశ్ కు 513 భారీ లక్ష్యాన్ని విధించింది.
