IPL 2022: వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్‌పై క్రికెట్ అభిమానుల ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ మ్యాచ్‌లు నెమ్మదిగా రసపట్టును తలపిస్తున్నాయి. సీజన్ ఆరంభ మ్యాచ్ తేలిపోయినా.. సూపర్ సండేనాడు జరిగిన రెండు మ్యాచ్‌లు క్రికెట్ అభిమానులకు మంచి వినోదాన్ని అందించాయి. తొలుత ముంబై-ఢిల్లీ మ్యాచ్, అనంతరం బెంగళూరు-పంజాబ్ మ్యాచ్ ఉర్రూతలూగించాయి. ఈ రెండు మ్యాచ్‌లలో సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్లే గెలిపించాయి. తొలి మ్యాచ్‌లో ఢిల్లీ ఓడిపోయేలా కనిపించగా.. లలిత్ యాదవ్, అక్షర్ పటేల్ పోరాడి తమ జట్టును గెలిపించారు. ముఖ్యంగా లలిత్ యాదవ్ 48 పరుగులతో అజేయంగా నిలిచి ఢిల్లీ గెలుపులో కీలకపాత్ర పోషించాడు.
ఇదే మ్యాచ్‌లో అంతకంటే ముందు ముంబై ఇన్నింగ్స్ సందర్భంగా ఢిల్లీ బౌలర్ కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లతో రాణించాడు. 2019 తర్వాత అతడు ఓ మ్యాచ్ లో మూడు వికెట్ల తీయడం ఇదే తొలిసారి. మరోవైపు ఐపీఎల్ తొలి మ్యాచ్ చెన్నై-కోల్‌కతా జట్ల మధ్య జరగ్గా.. కోల్‌కతా బౌలర్ ఉమేష్ యాదవ్ రెండు వికెట్లతో చెలరేగాడు. తొలి ఓవర్లోనే గత ఏడాది ఆరెంజ్ క్యాప్ హోల్డర్ రుతురాజ్ గైక్వాడ్ వికెట్ తీసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.
Also Read
- KS Bharat Retirement: ఇట్స్ అఫీషియల్.. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తెలుగు క్రికెటర్
- KL Rahul: కేఎల్ రాహుల్‌కు ఊహించని షాక్!
- Praggnanandhaa: వరల్డ్ ఛాంపియన్‌కు చెక్ మెట్.. హ్యాట్రిక్ విజయంతో నార్వే చెస్ టైటిల్ రేసులో దూసుకపోతున్న ప్రజ్ఞానంద.!
- AB de Villiers: ముంబై లోకల్ గ్రౌండ్లో అభిమానులతో కలిసి క్రికెట్ ఆడి సందడి చేసిన ‘మిస్టర్ 360’.!
ఈ నేపథ్యంలో ఉమేష్ యాదవ్, కుల్దీప్ యాదవ్, లలిత్ యాదవ్… ఇలా ముగ్గురి ప్రదర్శనను ఉద్దేశిస్తూ టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ చేసి ట్వీట్ దుమారం రేపింది. ’ప్రస్తుతం యాదవుల ఐపీఎల్ జరుగుతుంది‘ అని అర్థం వచ్చేలా సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌పై క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. క్రికెట్‌కు ప్రాంతం, కులాన్ని అంటగట్టడం మంచిది కాదని అభిమానులు ఫైర్ అవుతున్నారు.
తాజావార్తలు
-
KS Bharat Retirement: ఇట్స్ అఫీషియల్.. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తెలుగు క్రికెటర్
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Marriage Dispute: నాకు 41 ఏళ్లు సర్.. అయినా మా ఇంట్లో పెళ్లి చేయడం లేదు.. పోలీసులను ఆశ్రయించిన మహిళ
-
KL Rahul: కేఎల్ రాహుల్‌కు ఊహించని షాక్!
-
PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన ‘పెద్ది’
ట్రెండింగ్
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..