రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు, టీమిండియా ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. 2023 ఐపీఎల్ సీజన్‌కు ఆర్సీబీ కెప్టెన్‌గా మళ్లీ విరాట్ కోహ్లీ వ్యవహరిస్తాడని వెల్లడించాడు. తనపై ఒత్తిడి తగ్గించుకునేందుకు ఈ సీజన్‌కు విరాట్ కోహ్లీ చిన్న బ్రేక్ మాత్రమే తీసుకున్నాడని అశ్విన్ అన్నాడు. దీంతో అశ్విన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
మరోవైపు ఆర్సీబీ కొత్త కెప్టెన్‌గా డుప్లెసిస్‌ను ఎంపిక చేయడం మంచి పరిణామమని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. డుప్లెసిస్ ఐపీఎల్ కెరీర్ ముగింపు దశకు చేరుకుందని.. మహా అయితే అతడు ఇంకో రెండేళ్లు మాత్రమే ఐపీఎల్ ఆడతాడని అశ్విన్ తెలిపాడు. దక్షిణాఫ్రికా కెప్టెన్‌గా డుప్లెసిస్ అనుభవం ఐపీఎల్లో ఆర్సీబీ టీమ్‌కు పనికొస్తుందన్నాడు. తన అంచనా ప్రకారం వచ్చే ఏడాది కోహ్లీ మళ్లీ ఆర్సీబీ పగ్గాలు అందుకుంటాడని అనిపిస్తోందన్నాడు. ఇటీవల కొన్నాళ్ల పాటు కెప్టెన్సీ భారంతో కోహ్లీ సతమతం అయ్యాడని.. అందుకే ఇంటర్నేషనల్ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌లోనూ అతడు కెప్టెన్సీని వదులుకున్నాడని అశ్విన్ పేర్కొన్నాడు.