ఈరోజు విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో కలిసి దిగ్గిన ఓ ఫోటోను అభిమానులతో పంచుకున్నాడు. అయితే ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో భారత జట్టుకు న్యాయకత్వం వహించిన కోహ్లీ ప్రస్తుతం జరుగుతున్న న్యూజిలాండ్ సిరీస్ నుండి విశ్రాంతి తీసుకున్నాడు. ఇక తాజాగా చేసిన పోస్ట్ కు రెడ్ హార్ట్ ఎమోజితో “మై రాక్” అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ ఫోటోలో విరాట్ మరియు అనుష్క వైట్ టీ షర్టులలో కనిపిస్తారు. అయితే ఈ ఫోటో పోస్ట్ చేసిన కొద్ది సమయానికే అభిమానులు లైక్స్ అలాగే కామెంట్స్ తో విరుచుకపడ్డారు. “అందమైన ఫోటి” మరియు “అద్భుతం” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక కివీస్ తో ఈ నెల 25 నుండి ప్రారంభం కానున్న మొదటి టెస్ట్ కోసం విశ్రాంతి తీసుకున్న కోహ్లీ… డిసెంబర్ 3 నుంచి ముంబైలోని వాంఖడే స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరగనున్న రెండో టెస్టులో భారత జట్టుకు నాయకత్వం వహించనున్నాడు.