Virat Kohli: అర్ష్‌దీప్ క్యాచ్ డ్రాప్‌పై కోహ్లీ స్పందన.. ఆ రోజు రాత్రంతా నిద్ర పట్టలేదు..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli: యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియాకప్ రసవత్తరంగా సాగుతోంది. ఆదివారం నాడు సూపర్-4లో భాగంగా పాకిస్థాన్‌తో ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియాపై ఓడిపోవడంపై అభిమానులు నిరాశ చెందుతున్నారు. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ 18 బంతుల్లో 34 పరుగులు చేయాల్సిన దశలో అర్ష్‌దీప్ సింగ్ అసిఫ్ అలీ ఇచ్చిన క్యాచ్ డ్రాప్ చేయడంతో టీమిండియా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అర్ష్‌దీప్ క్యాచ్ విడిచిపెట్టడంపై ప్రెస్ కాన్ఫరెన్స్‌లో విరాట్ కోహ్లీని అడగ్గా.. ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఎంతో టెన్షన్ ఉంటుందని.. ఆ సమయంలో ఎవరైనా తప్పు చేసే అవకాశముందని కోహ్లీ అభిప్రాయపడ్డాడు. ఈ ఘటనను పెద్దదిగా చేసి చూడాల్సిన అవసరం లేదన్నాడు. అర్ష్‌దీప్ కుర్రాడు అని.. అతడికి ఇంకా నేర్చుకునే సమయం చాలా ఉందన్నాడు.
Read Also: జీవిత భాగస్వామిని వెతుకుతున్నారా.. ఈ విషయాలను పట్టించుకోవద్దు..
Also Read
- Century On Australia Team: ఆస్ట్రేలియాపై వీరవిహారం.. సెంచరీతో కదం తొక్కిన హసన్..
- Team India: టీమిండియాకు బిగ్ షాక్.. ఆసియా కప్, ఆసియా క్రీడలకు స్టార్ బ్యాటర్ దూరం..
- Harbhajan Singh: వారి త్యాగాలు లేకపోతే నేను ఇలా ఉండేవాడిని కాదు.. భావోద్వేగానికి గురైన హర్భజన్ సింగ్..
- Indian Bowler: బుమ్రా లేని లోటు.. సిరాజ్‌తో కలిసి కొత్త బంతిని పంచుకునే ఆ ‘సీక్రెట్’ పేసర్ ఎవరు..?
తన కెరీర్లోనూ ఇలాంటి ఘటన జరిగిందని కోహ్లీ గుర్తుచేసుకున్నాడు. తొలిసారి ఛాంపియన్స్ ట్రోఫీ ఆడుతున్నప్పుడు పాకిస్తాన్‌తో ఓ మ్యాచ్ జరిగిందని.. ఆ మ్యాచ్‌లో షాహిద్ అఫ్రిది బౌలింగ్‌లో తాను ఓ చెత్త షాట్ ఆడానని… తాను ఔటయ్యాక మనసు మనసులా లేదని.. ఆ రోజు రాత్రి నిద్ర పట్టలేదని.. మరుసటి రోజు ఉదయం 5గంటల వరకు సీలింగ్ ఫ్యాన్ చూస్తూనే ఉన్నానని కోహ్లీ వివరించాడు. ఆ టైంలో తన కెరీర్ ముగిసిందని అనిపించిందన్నాడు. కానీ నెమ్మదిగా ఆటపైనే దృష్టి సారించి ఆ విషయాన్ని మరిచిపోయానని పేర్కొన్నాడు. ఇప్పుడు అర్షదీప్ సింగ్ కూడా ఈ క్యాచ్ గురించి మర్చిపోయి మున్ముందు మరింత గొప్ప ప్రదర్శన ఇచ్చేందుకు ట్రై చేయాలని కోహ్లీ సూచించాడు. ప్లేయర్లు తమ తప్పుల నుండి నేర్చుకుంటారని.. కాబట్టి ఎవరైనా తప్పు చేస్తే మన్నించాలన్నాడు. అయితే మరోసారి ఒత్తిడిలో తప్పు చేయకుండా ట్రై చేయాలని కోహ్లీ పేర్కొన్నాడు.
తాజావార్తలు
-
TSLPRB : పోలీస్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి పెంపు.!
-
Century On Australia Team: ఆస్ట్రేలియాపై వీరవిహారం.. సెంచరీతో కదం తొక్కిన హసన్..
-
Golconda Traffic : గోల్కొండకు రేపు వెళ్లే వారూ.. ఈ రూట్లు గుర్తుపెట్టుకోండి.!
-
BSNL: కస్టమర్లకు ఇండిపెండెన్స్ డే ఆఫర్.. కేవలం ఒక రూపాయికే కొత్త స్కీమ్
-
Team India: టీమిండియాకు బిగ్ షాక్.. ఆసియా కప్, ఆసియా క్రీడలకు స్టార్ బ్యాటర్ దూరం..
ట్రెండింగ్
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!
-
Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
-
Income Tax Refund 2026: ఐటీఆర్ రీఫండ్ ఇంకా రాలేదా?.. వెంటనే ఈ 3 అంశాలు సరిచూసుకోండి..
-
Sumith Fernando Dies: టీమిండియాతో మొదటి టెస్ట్ ముందు.. శ్రీలంక క్రికెట్లో పెను విషాదం!