NTV Telugu Site icon

Kohli- Rahul: రంజీ మ్యాచ్‌లకు కోహ్లీ – రాహుల్ డుమ్మా.. అతడిపై మాత్రం వేటు!

Virat

Virat

Kohli- Rahul: జనవరి 23వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి రంజీ ట్రోఫీ గ్రూప్‌ స్టేజ్‌ మ్యాచ్‌లు.. తమ స్క్వాడ్‌లో ఇప్పటికే రిషభ్ పంత్‌తో పాటు విరాట్ కోహ్లీకి అవకాశం కల్పిస్తూ ఢిల్లీ క్రికెట్ సంఘం జాబితాను విడుదల చేసింది. కానీ, మెడ నొప్పితో కోహ్లీ రంజీ మ్యాచ్‌ ఆడలేనని బీసీసీఐకి సమాచారం ఇచ్చినట్లు కథనాలు ప్రసారం అవుతున్నాయి. ఆసీస్‌ టూర్ లో చివరి టెస్టులోనే మెడ పట్టేసిందని.. దానికి ఇంజెక్షన్లు కూడా వాడుతున్నట్లు పేర్కొన్నారు. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీ నేపథ్యంలో గాయం నుంచి కోలుకోవడానికి తగినంత సమయం ఇచ్చే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు టాక్. కెప్టెన్ రోహిత్ శర్మ ఆడటంపై ఈరోజు క్లారిటి వచ్చే ఛాన్స్ ఉంది.

Read Also: Parent Tips: పసిపిల్లలు ఆకలితో మాత్రమే కాదు.. ఈ కారణాల వల్ల కూడా ఏడుస్తారు

కాగా, కేఎల్‌ రాహుల్ రంజీ టోర్నీలో కర్ణాటక జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తాడని అందరు అనుకున్నప్పటికీ అతడి గాయం ఇంకా తగ్గలేదు. మోచేతి వద్ద నొప్పి ఉండటం వల్ల అందుబాటులో ఉండనని బీసీసీఐకి తేల్చి చెప్పాడని సమాచారం. దీంతో పంజాబ్‌తో జరిగే మ్యాచ్‌కు అతడ్ని కర్ణాటక క్రికెట్ సంఘం పక్కనపెట్టింది. పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతోన్న శుభ్‌మన్‌ గిల్ మాత్రం పంజాబ్‌ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడు. ఇక, రవీంద్ర జడేజా సైతం సౌరాష్ట్రకు ప్రాతినిధ్యం వహించబోతున్నాడు.

Read Also: Polavaram Project: డయాఫ్రం వాల్ నిర్మాణ పనులు ప్రారంభం!

అయితే, దేశవాళీ క్రికెట్‌లో అద్భుతమైన బ్యాటింగ్ తో అందరి దృష్టిని కరుణ్‌ నాయర్‌ ఆకర్షించాడు. అతడి రికార్డులను క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రశంసించాడు. తాజాగా టీమిండియా ఉమెన్స్ మాజీ హెడ్ కోచ్ డబ్ల్యూవీ రామన్ స్పందిస్తూ.. ఒకవేళ కరుణ్‌ నాయర్‌ను స్క్వాడ్‌లకి తీసుకుంటే మాత్రం.. తుది జట్టులో స్థానం ఇవ్వాలన్నారు. అతడిని రిజర్వ్‌గా తీసుకోవడానికి కుర్రాడు కాదన్నారు. ప్రస్తుతం ఉన్న ఫామ్‌తో ఫైనల్లో ఆడించాలని పేర్కొన్నాడు.