Vaibhav Sooryavanshi Debut: ఎంతో ప్రతిభ ఉన్నా.. వైభవ్ సూర్యవంశీకి అరంగేట్రం చేసే అర్హత ఉందా?
- భారత క్రికెట్లో సంచలనంగా వైభవ్ సూర్యవంశీ
- వైభవ్ సూర్యవంశీ అరంగేట్రంపై తీవ్ర ఉత్కంఠ
- భవిష్యత్ వైభవ్‌దే.. కానీ తొందర అవసరం లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Is Vaibhav Sooryavanshi Must Wait for His Debut: ఐపీఎల్లో అద్భుత ప్రదర్శనతో భారత క్రికెట్లో సంచలనంగా మారిన యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీకి ఐర్లాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌లో అరంగేట్రం దక్కుతుందా? అనే ప్రశ్న ప్రస్తుతం అభిమానులను తీవ్ర ఉత్కంఠకు గురిచేస్తోంది. అయితే టీమిండియా మేనేజ్మెంట్ మాత్రం ఈ విషయంలో తొందరపడే ఆలోచనలో లేదని సంకేతాలు ఇచ్చింది. యువ ప్రతిభను ప్రోత్సహించడం ఎంత ముఖ్యమో, ఇప్పటికే జట్టుకు విజయాలు అందిస్తున్న ఆటగాళ్లకు న్యాయం చేయడం కూడా అంతే అవసరమని భారత బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ స్పష్టం చేశాడు.
జట్టే ముఖ్యం.. వ్యక్తులు కాదు:
వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభ కలిగిన ఆటగాడని కోటక్ ప్రశంసించాడు. అండర్-19 జట్టులో అతడితో కలిసి పనిచేసిన అనుభవం తనకు ఉందని, ఎలాంటి వేదికలోనైనా ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యం అతడిలో ఉందని పేర్కొన్నాడు. అయినప్పటికీ కేవలం అరంగేట్రం చేయించాలనే ఉద్దేశంతో ఇప్పటికే నిలకడగా రాణిస్తున్న ఆటగాళ్లను పక్కన పెట్టడం సరికాదని స్పష్టం చేశాడు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అమలు చేస్తున్న సిద్ధాంతం ప్రకారం.. వ్యక్తిగతం కంటే జట్టు ప్రయోజనాలకే అత్యధిక ప్రాధాన్యం ఉంటుందని కోటక్ వివరించాడు. ‘వైభవ్ ఈ మ్యాచ్‌లో ఆడినా మంచిదే, ఆడకపోయినా మంచిదే. అతడు ఇప్పటికే భారత జట్టులో భాగమయ్యాడు. అతడికి తగిన సమయంలో అవకాశాలు తప్పకుండా వస్తాయి. కానీ ఇప్పటికే పరుగులు చేస్తూ జట్టుకు ఉపయోగపడుతున్న ఆటగాళ్లను తప్పించి కొత్తవారికి అవకాశం ఇవ్వడం ఇతరులకు అన్యాయం చేసినట్టే అవుతుంది’ అని కోటక్ అభిప్రాయపడ్డాడు.
Also Read
- IND vs SL 2nd Test Day 4: కొలంబోలో వర్షం కారణంగా ముందుగానే ఆట ముగింపు.. ఎవరిది పైచేయి?
- IND vs SL: జడేజా ఖాతాలో చెత్త రికార్డు.. అందులో నంబర్ వన్!
- IND vs SL: చరిత్ర సృష్టించిన సోనల్ దినూష.. 15 ఏళ్ల తర్వాత అరుదైన రికార్డు
- Suryakumar Yadav Comeback: బీసీసీఐ నుంచి గుడ్ న్యూస్.. 'సూరీడు' కమ్‌బ్యాక్ అవుతాడా?
ఓపెనింగ్ స్థానాల కోసం తీవ్ర పోటీ:
ప్రస్తుతం భారత జట్టులో ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ వంటి ఫామ్‌లో ఉన్న బ్యాటర్లు ఉన్నారు. వీరిలో ఎవరినైనా తప్పించి వైభవ్‌కు అవకాశం ఇవ్వాలంటే జట్టు సమతుల్యతపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కేవలం అభిమానుల ఆసక్తి లేదా సోషల్ మీడియా హైప్ ఆధారంగా నిర్ణయాలు తీసుకోకుండా.. ప్రతిభ, ప్రదర్శనకు ప్రాధాన్యం ఇవ్వాలని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది. జట్టులో చోటు సంపాదించాలంటే మంచి ప్రదర్శనకే విలువ ఉండాలనే నమ్మకం డ్రెస్సింగ్ రూమ్‌లో కొనసాగాలని గంభీర్ భావిస్తున్నట్లు కోటక్ వ్యాఖ్యల ద్వారా స్పష్టమైంది. నిలకడగా రాణిస్తున్న ఆటగాడిని పక్కన పెట్టి.. కొత్త ఆటగాడికి అవకాశం ఇస్తే జట్టులోని ఇతర ఆటగాళ్లలో అసంతృప్తి కలిగే ప్రమాదం ఉందని మేనేజ్మెంట్ అంచనా వేస్తోంది.
భవిష్యత్ వైభవ్‌దే.. కానీ తొందర అవసరం లేదు:
కేవలం 15 ఏళ్ల వయసులోనే భారత జట్టులో చోటు దక్కించుకున్న వైభవ్ సూర్యవంశీకి ఇంకా సుదీర్ఘ క్రికెట్ కెరీర్ ఉంది. ప్రస్తుతం సీనియర్ జట్టుతో కలిసి డ్రెస్సింగ్ రూమ్ వాతావరణాన్ని అర్థం చేసుకోవడం, అనుభవజ్ఞుల నుంచి నేర్చుకోవడం అతడి భవిష్యత్‌కు మరింత ఉపయోగపడుతుందని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది. సరైన సమయంలో, పూర్తిగా అర్హత ఆధారంగా భారత జట్టులో అరంగేట్రం చేస్తేనే.. అతడి అంతర్జాతీయ కెరీర్‌కు బలమైన పునాది పడుతుందని క్రికెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..