Vaibhav Sooryavanshi: ప్రపంచ రికార్డుపై వైభవ్ సూర్యవంశీ కన్ను.. ఇంకెవ్వరూ బ్రేక్ చేయలేరేమో!
- హరారే వేదికగా జరిగే తొలి టీ20
- హరారేలో అద్భుతమైన ట్రాక్ రికార్డు
- ప్రపంచ రికార్డుపై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vaibhav Sooryavanshi Eyes Youngest T20I Century: టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి తన ప్రతిభను నిరూపించుకునేందుకు సిద్ధమయ్యాడు. ఇంగ్లండ్ పర్యటనలో ఆశించిన స్థాయిలో రాణించలేక విమర్శలు ఎదుర్కొన్న ఈ 15 ఏళ్ల కుర్రాడు.. ఇప్పుడు జింబాబ్వేతో జరిగే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారీగా రన్స్ చేయాలని పట్టుదలగా ఉన్నాడు. ఈరోజు హరారే వేదికగా జరిగే తొలి టీ20తోనే భారీ ఇన్నింగ్స్ ఆడాలని చూస్తున్న వైభవ్.. ఈ సిరీస్‌లో పలు ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టే అవకాశం ఉంది.
హరారేలో అద్భుతమైన ట్రాక్ రికార్డు:
హరారే మైదానం వైభవ్ సూర్యవంశీకి ఎంతో ప్రత్యేకమైనది. ఇదే వేదికపై ఈ ఏడాది జరిగిన అండర్-19 ప్రపంచ కప్‌లో అతడు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఫైనల్లో ఇంగ్లండ్‌పై కేవలం 80 బంతుల్లోనే 175 పరుగులు బాది భారత్‌కు ప్రపంచ కప్‌ను అందించాడు. జింబాబ్వేలో జరిగిన ఏజ్ గ్రూప్ క్రికెట్లో ఏడు మ్యాచ్‌లు ఆడిన వైభవ్.. 62.71 సగటు, 169.49 స్ట్రైక్‌రేట్‌తో 439 పరుగులు చేశాడు. ఇప్పుడు అదే మైదానంలో భారత సీనియర్ జట్టుతో ఆడే అవకాశం రావడంతో.. మరోసారి భారీ ఇన్నింగ్స్‌పై బుడ్డోడు కన్నేశాడు.
సెంచరీ బాదితే ప్రపంచ రికార్డు ఖాయం
Also Read
- Travis Head-Abhishek: కాటేరమ్మ కొడుకుల విశ్వరూపం.. ఇటు అభిషేక్, అటు ట్రావిస్ హెడ్.. బాదుడే బాదుడు..
- BCCI కీలక నిర్ణయాలు.. లైంగిక వేధింపులపై కొత్త కమిటీ, IPL 2027పై ఫోకస్
- ICC T20 Rankings: ఆఫ్ఘనిస్థాన్‌ను క్లీన్‌స్వీప్ చేసినా ఉపయోగం లేకపాయే.. నంబర్ 1 స్థానం ఫసక్..!
- Gautam Gambhir: హార్దిక్ వస్తే నితీశ్ రెడ్డి పరిస్థితి ఏంటి?.. గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు!
శతకం చేస్తే:
జింబాబ్వే సిరీస్‌లో వైభవ్ సూర్యవంశీ శతకం చేస్తే.. అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలో అత్యంత పిన్న వయసులో సెంచరీ చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు సృష్టిస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు ఫ్రాన్స్‌కు చెందిన గుస్తావ్ మెకియాన్ పేరిట ఉంది. 18 సంవత్సరాల 280 రోజుల వయసులో అతడు సెంచరీ బాదాడు. కేవలం 15 ఏళ్ల వయసులో ఉన్న వైభవ్ సెంచరీ సాధిస్తే.. ఆ రికార్డు తుడిచిపెట్టుకుపోనుంది. ఒకవేళ బుడ్డోడు సెంచరీ చేస్తే.. ఆ రికార్డును మరొకరు బ్రేక్ చేయడం అసాధ్యమే. 15 ఏళ్లకే టీమిండియాలో రావడం అసాధ్యం.. అందులోనూ శతకం బాదడం అస్సలు అయ్యే పనికాదు.
సిక్సర్లతో రికార్డులపై గురి:
మొదటి బంతి నుంచే భారీ షాట్లు ఆడే వైభవ్ సూర్యవంశీ శైలి ఇప్పటికే ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఐపీఎల్ 2026లో జస్ప్రీత్ బుమ్రా, పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్ వంటి ప్రపంచ స్థాయి బౌలర్లపైనా ఎలాంటి బెరుకు లేకుండా ఎదురుదాడి చేసి తన పవర్ హిట్టింగ్‌ను చాటుకున్నాడు. టీనేజ్ క్రికెటర్లలో పురుషుల టీ20 క్రికెట్లో అతడి కంటే ఎక్కువ సిక్సర్లు బాదిన ఆటగాడు ఇప్పటివరకు లేడు. ఇదే జోరును జింబాబ్వే సిరీస్‌లో కొనసాగిస్తే.. ఒకే టీ20 సిరీస్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన టీనేజ్ బ్యాటర్‌గా మరో అరుదైన రికార్డును కూడా తన ఖాతాలో వేసుకునే అవకాశం ఉంది.
రోహిత్, రాహుల్ రికార్డులకు ముప్పు:
భారత్ తరఫున టీ20ల్లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన రికార్డు ప్రస్తుతం రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ పేరిట ఉంది. వీరిద్దరూ 14 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేశారు. అయితే వైభవ్ దూకుడైన బ్యాటింగ్‌ను చూస్తే.. ఈ రికార్డుత్వరలో బ్రేక్ అవనుంది. ఇప్పటికే లిస్ట్-ఏ క్రికెట్లో కేవలం 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన ఘనత వైభవ్ పేరిట ఉంది. పవర్‌ప్లేలో అతడు చెలరేగితే రోహిత్, రాహుల్ రికార్డులు కూడా తుడిచిపెట్టుకుపోయాయి.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..