T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్ ఆడుతుందా.? లేదా? అనే విషయంపై పాకిస్తాన్ ఇంకా సస్పెన్స్ కొనసాగిస్తోంది. భద్రతా సాకులు చూపుతూ, అనవసర రాద్ధాంతం చేసిన బంగ్లాదేశ్, ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించింది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తమ వేదికను భారత్ నుంచి శ్రీలంకకు మార్చాలని ఐసీసీపై ఒత్తిడి తెచ్చింది. చివరకు ఐసీసీ అందుకు ఒప్పుకోకపోవడంతో టోర్నీ నుంచి అవుట్ అయింది. ఇప్పుడు, బంగ్లాకు మద్దతుగా తాము కూడా టోర్నీని బాయ్‌కాట్ చేస్తామని పాకిస్తాన్ చెబుతోంది. ఒక వేళ టోర్నీ మొత్తాన్ని బహిష్కరించకున్నా, భారత్‌తో జరిగే మ్యాచ్ బాయ్‌కాట్ చేస్తామని లీకులు ఇస్తోంది.
Read Also: Tirumala Laddu Adulteration Case: తిరుమల కల్తీ లడ్డూ వ్యవహారం.. ప్రభుత్వానికి సిట్ లేఖ
ఇదిలా ఉంటే, ఇప్పటికే బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్‌ను ఐసీసీ తీసుకుంది. ఇప్పుడు పాకిస్తాన్ ఆడకుంటే తాము ఆడుతామంటూ పలు దేశాలు ముందుకు వస్తున్నాయి. పాకిస్తాన్ ఏదో ఒకటి త్వరగా చెప్పాలని ఇటీవల ఐస్లాండ్ ట్వీట్ చేసింది. ఇప్పుడు, పాకిస్తాన్ తప్పుకుంటే తమకు అవకాశం ఇవ్వాలని మరో దేశం కూడా కోరుతోంది. ‘‘టీ20 వరల్డ్ కప్‌లో ఖాళీ ఏర్పడితే తాము సిద్ధంగా ఉన్నాం’’ అంటూ ఉగాండా ముందుకు వచ్చింది. ‘‘పూర్తిగా ప్యాక్ అయి, ప్యాడ్స్ కట్టుకుని, పాస్‌పోర్టులు వేడిగా ఉన్నాయి. ఎలాంటి సాకులు లేకుండా మేము వెంటనే టీ20 వరల్డ్ కప్ ఆడుతాం’’ అంటూ ఉగాండా ఐసీసీకి తన అభ్యర్థనను తెలియజేసింది.
