T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్ ఆడుతుందా.? లేదా? అనే విషయంపై పాకిస్తాన్ ఇంకా సస్పెన్స్ కొనసాగిస్తోంది. భద్రతా సాకులు చూపుతూ, అనవసర రాద్ధాంతం చేసిన బంగ్లాదేశ్, ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించింది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తమ వేదికను భారత్ నుంచి శ్రీలంకకు మార్చాలని ఐసీసీపై ఒత్తిడి తెచ్చింది.