U-19 World Cup IND vs BAN: అండర్–19 వరల్డ్ కప్‌లో ఐదు సార్లు ఛాంపియన్ టీమిండియా మరో టైటిల్ వేటలో తమ జోరును కొనసాగించేందుకు సిద్ధమైంది. ఈరోజు ( జనవరి 17న) జరిగే గ్రూప్ ‘బి’ పోరులో బంగ్లాదేశ్ అండర్-19తో భారత కుర్రాళ్లు తలపడతారు. అన్ని రంగాల్లో పటిష్టంగా ఉన్న మెన్ ఇన్ బ్లూను నిలువరించడం బంగ్లాకు కూడా కష్టమే. కెప్టెన్ ఆయుశ్ మాత్రే, విధ్వంసకర బ్యాటర్ వైభవ్ సూర్యవంశీలతో ఓపెనింగ్ పటిష్టంగా ఉండగా వేదాంత్, విహాన్ మల్హోత్రాలు కీలక ఇన్సింగ్స్ ఆడే బ్యాటర్లు.
Read Also: Facial attendance: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు షాక్.. ఏపీ సర్కార్లో ఫేస్ రికగ్నిషన్ యాప్
అయితే, మెరుపు బ్యాటింగ్‌తో ఆకట్టుకునే అభిజ్ఞాన్ కుందు మిడిలార్డర్‌లో భారత జట్టుకు బలం అని చెప్పాలి. ఇక, దీపేశ్, హెనిల్, ఖిలాన్, అంబరీశ్‌లతో జట్టు బౌలింగ్ కూడా అద్భుతంగా ఉంది. గత ఏడాది కాలంగా మన అండర్19 టీమ్ అద్భుత ఫామ్‌లో ముందుకు సాగుతుంది. ఇంగ్లండ్, ఆ్రస్టేలియా, దక్షిణాఫ్రికాలపై సిరీస్‌లు నెగ్గడంతో పాటు ఆసియా కప్‌లో కూడా జట్టు ఫైనల్‌కి చేరుకుంది. గత 17 మ్యాచ్‌లలో భారత్ 14 మ్యాచ్ లో విజయం సాధించింది.
Read Also: Gorantla Madhav NBW: మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కు షాక్.. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ..
ఇక, తొలి మ్యాచ్‌లో అమెరికాను భారత్ చిత్తు ఓడించగా.. టోర్నమెంట్లో బంగ్లాదేశ్ కు ఇదే తొలి మ్యాచ్.. ఆ టీమ్‌లో కెప్టెన్ అజీజుల్ హకీమ్ మినహా మిగతా వారికి పెద్దగా అనుభవం లేదని చెప్పాలి.. హకీమ్‌తో పాటు రెండేళ్ల క్రితం వరల్డ్ కప్‌లోనూ రాణించిన జవాద్ అబ్రార్‌ల, కలీమ్ సిద్దిఖీలపై బ్యాటింగ్ భారం పడనుంది. జింబాబ్వేలో పేస్‌కు అనుకూలించే పిచ్‌లపై తమ బౌలర్లు ఇక్బాల్ హుస్సేన్, అల్ ఫహద్ రాణిస్తారని బంగ్లాదేశ్ భారీగా ఆశలు పెట్టుకుంది. సమీయుల్ బషర్ ప్రధాన స్పిన్నర్. కాగా, ఈ మ్యాచ్ మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభం కానుంది.
