U19 World Cup 2024 India Squad: అండర్-19 ప్రపంచకప్ టోర్నమెంట్‌లో పాల్గొనే భారత జట్టును బీసీసీఐ జూనియర్ సెలక్షన్ కమిటీ మంగళవారం ప్రకటించింది. ప్రస్తుతం దుబాయ్‌లో అండర్-19 ఆసియాకప్ 2023లో పాల్గొంటున్న జట్టునే మెగా టోర్నీకి ఎంపిక చేసింది. ప్రపంచకప్ జట్టుకు పంజాబ్‌కు చెందిన ఉదయ్ సహరన్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. మధ్యప్రదేశ్‌కు చెందిన సౌమ్య్‌కుమార్ పాండే వైస్ కెప్టెన్‌గా అవకాశం దక్కించుకున్నాడు. దక్షిణాఫ్రికా వేదికగా జనవరి 19 నుంచి ఫిబ్రవరి 11 వరకు ప్రపంచకప్ జరగనుంది.…