Tom Latham: ఆమ్మో జస్ప్రీత్ బుమ్రా.. రెండు సార్లు డకౌట్.. రెండో టెస్టుకు మాస్టర్ ప్లాన్ వేశా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tom Latham About Jasprit Bumrah: టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌ను ఎదుర్కోవడం అంత సులభం కాదని న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్‌కు మరోసారి అర్థమైంది. తొలి టెస్టులో బుమ్రా ధాటికి రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ డకౌట్‌గా వెనుదిరిగిన లాథమ్.. క్రైస్ట్‌చర్చ్‌లోని హ్యాగ్లీ ఓవల్ వేదికగా జరగనున్న రెండో టెస్టులో అతడిని ఎలా ఎదుర్కోవాలనే దానిపై తాజాగా స్పందించాడు. అయితే బుమ్రాను ఎదుర్కొనేందుకు తన బ్యాటింగ్ టెక్నిక్‌లో భారీ మార్పులు చేసుకోబోనని స్పష్టం చేశాడు. తన సహజమైన ఆటతీరును కొనసాగిస్తూ.. పరుగులు చేయడమే తన లక్ష్యమని లాథమ్ చెప్పాడు.
రెండో టెస్టుకు ముందు మీడియాతో మాట్లాడిన టామ్ లాథమ్.. బుమ్రా కొత్త బంతితో అయినా, పాత బంతితో అయినా ప్రత్యర్థి బ్యాటర్లకు సవాళ్లు విసరగలడని ప్రశంసించాడు. ‘బుమ్రా ప్రత్యేకమైన బౌలింగ్ యాక్షన్ కలిగి ఉంటాడు. మిగతా బౌలర్లతో పోలిస్తే బ్యాటర్‌కు కొంత దగ్గరగా వచ్చి బంతిని విడుదల చేస్తాడు. అందుకే అతడిని ఎదుర్కోవడం కష్టంగా ఉంటుంది. నా వరకు అయితే.. బుమ్రా వేయబోయే అత్యంత ప్రమాదకరమైన బంతిని ఎదుర్కొనేందుకు సరైన రీతిలో సిద్ధం కావాలి. ప్రతి ఆటగాడి విధానం ఒక్కోలా ఉంటుంది’ అని వివరించాడు.
Also Read
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాట్‌లో ఎన్విడియా ఏఐ చిప్స్..? ఆ దేశ క్రికెట్ బోర్డ్ ఆసక్తికర పోస్ట్
- Chris Gayle: వైభవ్ విధ్వంసానికి క్రిస్ గేల్ ఫిదా.. వన్డేల్లో 300 పరుగులు ఖాయమంటూ జోస్యం..!
- Viral Cricket Video: బైక్‌పై వెళ్తూ ఒంటిచేత్తో క్యాచ్ పట్టేశాడు.. పిచ్చెక్కించే వీడియో మామ.. తప్పక చూడాల్సిందే!
- Vaibhav Sooryavanshi: 53 బంతుల్లో 204 పరుగులు.. అయినా వైభవ్‌కు వన్డే ఛాన్స్ ఇప్పుడే రాదా?
బుమ్రా బౌలింగ్‌లో పరుగులు చేయడానికి ప్రత్యేకమైన వ్యూహం కంటే బంతిపై దృష్టి పెట్టడం ముఖ్యమని టామ్ లాథమ్ అభిప్రాయపడ్డాడు. ‘సాధ్యమైనంత వరకు నా ఆటపైనే దృష్టి పెట్టాలి. బంతిని జాగ్రత్తగా గమనిస్తూ.. అది ఏ వైపు స్వింగ్ అవుతుందో అంచనా వేసి చివరి క్షణంలో నిర్ణయం తీసుకోవాలి’ అని చెప్పాడు. తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో విఫలమైనప్పటికీ తన బ్యాటింగ్ విధానాన్ని మార్చుకోవాలని అనుకోవడం లేదని స్పష్టం చేశాడు. ‘ఒకసారి విఫలమైనప్పుడు ఏదో కొత్తగా ప్రయత్నించాలనే ఆలోచన మనల్ని పక్కదారి పట్టించవచ్చు. ఇప్పటివరకు నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది నా ఆటపై ఉన్న స్పష్టతే. కాబట్టి టెక్నికల్‌గా కూడా విషయాలను చాలా సులభంగా ఉంచుకోవాలనుకుంటున్నాను. పరుగులు చేయడానికి ఏదో అద్భుతమైన పరిష్కారం దొరుకుతుందని వెతకడం అవసరం లేదు. క్రికెట్లో అలాంటి మ్యాజిక్ పరిష్కారాలు ఉండవు’ అని వ్యాఖ్యానించాడు.
న్యూజిలాండ్ పరిస్థితుల్లో ఓపెనర్‌గా బ్యాటింగ్ చేయడం ఎప్పుడూ సవాలుతో కూడుకున్నదని లాథమ్ తెలిపాడు. ఎంత బాగా సిద్ధమైనా మైదానంలో ఫలితాలు మనకు అనుకూలంగా వస్తాయనే హామీ ఉండదన్నాడు. తొలి టెస్టుకు ముందు చేసినట్లుగానే రెండో మ్యాచ్‌కు కూడా తన సన్నాహాలు కొనసాగిస్తున్నానని, ప్రస్తుత క్షణంపై దృష్టి పెట్టి జట్టుకు తన వంతు సహకారం అందించడమే లక్ష్యమని చెప్పాడు. కెప్టెన్‌గా తన బాధ్యతలు బ్యాటింగ్‌తోనే ముగిసిపోవని లాథమ్ గుర్తుచేశాడు. బ్యాటింగ్‌లో జట్టుకు ఎంత సహకారం అందించగలిగితే అంత ఇవ్వడంతో పాటు కెప్టెన్‌గా కూడా తన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించాల్సి ఉంటుందని పేర్కొన్నాడు. తొలి టెస్టులో బుమ్రా చేతిలో ఎదురైన వైఫల్యాన్ని మర్చిపోయి.. రెండో మ్యాచ్‌లో తన సహజమైన ఆటతీరుతో రాణించాలని లాథమ్ భావిస్తున్నాడు.
తాజావార్తలు
-
AP Local Body Elections Live Updates : ఏపీలో ఎన్నికల సందడి.. పల్లెలు, పట్టణాల్లో మొదలైన పోలింగ్!
-
Tom Latham: ఆమ్మో జస్ప్రీత్ బుమ్రా.. రెండు సార్లు డకౌట్.. రెండో టెస్టుకు మాస్టర్ ప్లాన్ వేశా!
-
Vardhman Jain : శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాలు.. ఎవరీ వర్ధమాన్ జైన్.?
-
Allu Arjun: అల్లు అర్జున్ ప్లాన్ అదిరింది.. మైల్ స్టోన్ మూవీకి ఎవరు?
-
DGP CV Anand: “సిబ్బంది ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి”.. ట్రాఫిక్ సమస్యలపై డీజీపీ కీలక వ్యాఖ్యలు..
-
Apple Kukatpally: హైదరాబాద్‌లో తొలి అధికారిక Apple స్టోర్.. డిసెంబర్ 10న ప్రారంభం..!
ట్రెండింగ్
-
Social Media Star: మహేష్ బాబు ఒక్క కామెంట్.. ఓవర్‌నైట్ స్టార్ అయిపోయిన చిన్నారి..!
-
Chris Gayle: వైభవ్ విధ్వంసానికి క్రిస్ గేల్ ఫిదా.. వన్డేల్లో 300 పరుగులు ఖాయమంటూ జోస్యం..!
-
Vrushakarma Trailer: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘వృషకర్మ’ ట్రైలర్.. పీక్స్‌కు చేరిన అంచనాలు!
-
Viral Cricket Video: బైక్‌పై వెళ్తూ ఒంటిచేత్తో క్యాచ్ పట్టేశాడు.. పిచ్చెక్కించే వీడియో మామ.. తప్పక చూడాల్సిందే!
-
9,530mAh బ్యాటరీ, 108MP కెమెరాతో Honor Magic 9 Lite+ 5G..!