Team India: వన్డేల్లో టీమిండియా చెత్త రికార్డు.. శ్రీలంకతో సమానంగా..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Team India: వన్డే ఫార్మాట్‌లో టీమిండియా మంచి జట్టే. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కానీ తొలి వన్డేలో చెత్త ప్రదర్శనతో బంగ్లాదేశ్‌పై ఓటమిపాలైంది. దీంతో పలు చెత్త రికార్డులు టీమిండియా ఖాతాలో చేరాయి. ఈ నేపథ్యంలో వన్డే ఫార్మాట్‌లో అత్యధిక ఓటములు చవిచూసిన జట్టుగా నిలిచింది. ఆదివారం నాడు బంగ్లా చేతిలో ఓటమి భారత్‌కు వన్డేల్లో 435వ పరాజయం. ఇప్పటి వరకు భారత జట్టు 1018 వన్డేలు ఆడి 435 మ్యాచుల్లో ఓడింది. భారత్‌తో పాటు శ్రీలంక కూడా వన్డే ఫార్మాట్‌లో 435 ఓటములు మూటగట్టుకుంది. అయితే భారత్ కంటే శ్రీలంక తక్కువ వన్డేలు ఆడింది. శ్రీలంక 878 వన్డేలు ఆడి 435 మ్యాచుల్లో ఓటమి చవిచూసింది.
Read Also: Saibaba Temple: సాయి పాదాలమీదే ప్రాణాలు వదిలాడు
Also Read
- Women's World Cup 2026: రన్‌రేట్ ప్లస్.. కానీ ఆసీస్‌తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్‌కు ఉన్న అవకాశాలివే..
- Yash Dayal: యశ్ దయాల్ ‘కమ్‌బ్యాక్’.. ‘పోక్సో’ కేసుల నుంచి విముక్తి!
- Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్‌తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
- Vaibhav Sooryavanshi Debut: ఎంతో ప్రతిభ ఉన్నా.. వైభవ్ సూర్యవంశీకి అరంగేట్రం చేసే అర్హత ఉందా?
మొత్తంగా వన్డే ఫార్మాట్‌లో అత్యధిక ఓటములు చవిచూసిన జట్లుగా భారత్, శ్రీలంక సమంగా నిలిచాయి. అటు బంగ్లాదేశ్‌పై ఆదివారం నాడు భారత్ 186 పరుగులకు ఆలౌటైంది. ఇది బంగ్లాపై భారత్‌కు రెండో అత్యల్ప స్కోరు. అయితే తొలి అత్యల్ప స్కోరు చేసినప్పుడు భారత్ గెలిచింది. 2014లో బంగ్లాదేశ్ బౌలర్లు విజృంభించడంతో టీమిండియా కేవలం 105 పరుగులకే ఆలౌట్ అయింది. అయితే స్టువర్ట్ బిన్నీ (6/4) ఆరు వికెట్లతో చెలరేగడంతో ఆ మ్యాచ్‌లో భారత్ గెలిచింది. మళ్లీ ఇప్పుడు బంగ్లాపై మరోసారి స్వల్ప స్కోరుకే భారత్ ఆలౌట్ అయింది. కానీ ఈ మ్యాచ్‌లో ఓడిపోయి విమర్శలను ఎదుర్కొంటోంది. కీలక సమయంలో కేఎల్ రాహుల్ క్యాచ్ విడిచిపెట్టడం వల్లే టీమిండియా ఓడిందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
Ketan Agarwal Case: కేతన్‌ను లోయలోకి తోసేముందు చేతన్ ఏమన్నాడో తెలుసా.. వెలుగులోకి కొత్త విషయాలు
-
Ketan Agarwal Case: కేతన్-సియా కేసులో కొత్త ట్విస్ట్.. బ్లాక్మెయిల్ కోణంలో దర్యాప్తు..
-
IAS Krishna Teja: పంచాయతీ నిధుల గోల్మాల్.. వైరల్‌గా మారిన కమిషనర్ కృష్ణతేజ వార్నింగ్..
-
Sanjay Jaju : తెలంగాణ నూతన సీఎస్ గా సంజయ్ జాజు నియామకం
-
Varanasi Update: ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. ఈ సెప్టెంబర్ నాటికే..!
ట్రెండింగ్
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్‌గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్‌తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!