IND vs PAK T20 World Cup: భారత్ వర్సెస్ పాక్: 2026 టీ20 వరల్డ్ కప్లో ఎన్నిసార్లు తలపడనున్నారు..?
- 2026లో భారత్-పాకిస్థాన్ మధ్య హోరాహోరీ పోటీలు..
- ఈ ఏడాది క్రికెట్ అభిమానులకు పండగే పండుగ..
- భారత్- పాక్ మ్యాచ్‌లు.. అభిమానుల హార్ట్‌బీట్ పెరుగుతోంది..
IND vs PAK T20 World Cup: 2026 సంవత్సరం క్రికెట్ అభిమానులకు ఒక పండుగలా మారబోతుంది. అండర్-19 వరల్డ్ కప్ నుంచి మెన్స్ టీ20 వరల్డ్ కప్, మహిళల టీ20 వరల్డ్ కప్ వరకూ అన్ని వర్గాలు, అన్ని విభాగాల్లో ప్రపంచ స్థాయి పోటీలు జరగబోతున్నాయి. ఈ టోర్నీల్లో అత్యంత ఆసక్తిగా ఎదురు చూసే మ్యాచ్ ఎదైనా ఉందంటే అది కేవలం భారత్-పాకిస్థాన్ మధ్య పోరే. గత ఏడాది 2025లో కూడా ఇరు జట్లు పలు టోర్నీల్లో పరస్పరం తలపడ్డాయి. చాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్‌లో మూడు సార్లు, మహిళల వన్డే వరల్డ్ కప్, అండర్-19 ఆసియా కప్‌లోనూ భారత్-పాక్ తలపడటం అభిమానులను ఉర్రూతలూగించాయి. 2026లో కూడా ఈ రెండు బద్ద శత్రువుల మధ్య పోరు కొనసాగనుంది.
Read Also: Top Headlines @ 9 AM: టాప్ న్యూస్
Also Read
- BCCI: ఐపీఎల్ ఆటగాళ్ల 'గర్ల్‌ఫ్రెండ్ కల్చర్'పై బీసీసీఐ సీరియస్.. హార్దిక్, యశస్వి, ఇషాన్, అర్ష్‌దీప్‌లకు బిగ్ షాక్!
- PSL 2026 Final: తొమ్మిదేళ్ల నిరీక్షణకు తెర.. కెప్టెన్‌గా తొలి పీఎస్ఎల్ ట్రోఫీ అందుకున్న బాబర్ ఆజం
- Sai Sudharsan: 13 ఏళ్ల రికార్డు బద్దలు గొట్టిన సాయి సుదర్శన్.. క్రిస్ గేల్‌ను వెనక్కి నెట్టిన టీమిండియా కుర్రాడు..
- KKR: ద్వితియార్థంలో దూసుకుపోతున్న కేకేఆర్.. ఈ ఒక్క సూత్రమే వారి జోరుకు కారణమా..?
మెన్స్ టీ20 వరల్డ్ కప్‌లో భారత్–పాక్ సమరం
2026 మెన్స్ టీ20 వరల్డ్ కప్‌లో భారత్, పాకిస్థాన్ జట్లు తొలిసారి ఫిబ్రవరి 15వ తేదీన తలపడనున్నాయి. ఈ కీలక మ్యాచ్ శ్రీలంకలోని కొలంబోలో ఉన్న ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరగనుంది. ఇది గ్రూప్ దశలో జరిగే మ్యాచ్ కాగా, భారత్ ఈ టోర్నీలో ఆడే ఏకైక విదేశీ మ్యాచ్ ఇదే కావడం విశేషం. గ్రూప్ దశలోనే కాకుండా ఇరు జట్లు సెమీఫైనల్ లేదా ఫైనల్‌కు అర్హత సాధిస్తే మరోసారి ముఖాముఖి పోటీపడే ఛాన్స్ కూడా ఉంది. దీంతో టీ20 వరల్డ్ కప్‌లో భారత్- పాకిస్థాన్ మ్యాచ్‌లపై అంచనాలు ఇప్పటికే భారీగా పెరిగాయి.
Read Also: TheRajaSaab : రాజాసాబ్ రన్ టైమ్ ఏకంగా నాలుగు గంటలపైనే : మారుతీ
అండర్-19 మెన్స్ వరల్డ్ కప్‌లో పోరాడే అవకాశం..
అండర్-19 మెన్స్ వరల్డ్ కప్‌లో భారత్, పాకిస్థాన్ నేరుగా లీగ్ దశలో తలపడే అవకాశం లేదు. డ్రా ప్రకారం గ్రూప్-Aలో భారత్, గ్రూప్-Bలో పాకిస్థాన్ ఉన్నాయి. అందువల్ల లీగ్ దశలోనూ, సూపర్ సిక్సెస్‌లోనూ ఇరు జట్లు ముఖాముఖి పోటీ పడే ఛాన్స్ లేదు. కానీ, సెమీఫైనల్ లేదా ఫైనల్‌కు రెండు జట్లు చేరితే మాత్రమే భారత్-పాక్ మధ్య పోరు చూసే అవకాశం ఉంది.
Read Also: Hyderabad Fog: కాశ్మీర్ను తలపించేలా హైదరాబాద్.. శివారు ప్రాంతాలను కమ్మేసిన పొగమంచు..
మహిళల టీ20 వరల్డ్ కప్‌లో హోరాహోరీ
2025లో జరిగిన మహిళల వన్డే వరల్డ్ కప్‌లో ట్రోఫీని గెలిచిన భారత మహిళల జట్టు.. 2026లో ఇంగ్లండ్ వేదికగా జరిగే మహిళల టీ20 వరల్డ్ కప్‌లో తమ తొలి టైటిల్‌ను గెలుచుకోవాలని ఆశిస్తోంది. ఈ టోర్నీలో భారత్, పాకిస్థాన్ ఒకే గ్రూప్‌లో ఉండడం విశేషం. జూన్ 14వ తేదీన ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇరు జట్ల మధ్య గ్రూప్ మ్యాచ్ జరగనుంది. అలాగే, రెండు జట్లు సెమీఫైనల్ లేదా ఫైనల్‌కు చేరితే మరోసారి కీలక పోరులో తలపడే ఛాన్స్ ఉంది. కాబట్టి, మొత్తంగా 2026లో మెన్స్, మహిళల, జూనియర్ క్రికెట్ స్థాయిల్లో భారత్-పాక్ మ్యాచ్‌లు క్రికెట్ అభిమానులకు పండుగ వాతావరణాన్ని సృష్టించనున్నాయి. ప్రతి మ్యాచ్‌పై ఉత్కంఠతను తారాస్థాయికి పెంచేలా కనిపిస్తోంది. క్రికెట్ ప్రపంచంలో ఉత్కంఠభరితమైన ఈ బద్ద శత్రువులు 2026లో జరిగే అన్ని టోర్నీలను కలిపి సుమారు 8 సార్లు పోటీ పడే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Bengal Election Results Live Updates: బెంగాల్ బాద్షా బీజేపీ..! టీఎంసీకి మరో షాక్..! అప్డేట్స్ మీకోసం..
-
Election Results 2026: గెలుపెవరిది?.. 4 రాష్ట్రాలు+UT ఎన్నికల ఫలితాలు.. మినిట్స్ టు మినిట్స్ అప్డేట్స్..
-
Vijay TVK: “బాక్సాఫీస్ వద్దే కాదు.. బ్యాలెట్ బాక్సుల వద్ద కూడా అతనే ‘తుపాకీ’! విజయ్ సీఎం అవుతాడా?
-
Trisha: పదేళ్లలో సీఎం అవుతానన్న త్రిష వీడియో వైరల్
-
West Bengal Results: తృణమూల్ కోటలో ‘కమల’ వికాసం.. బెంగాల్లో ఘనవిజయం దిశగా బీజేపీ అడుగులు
-
Trisha Political Entry: త్రిష పొలిటికల్ ఎంట్రీ..? విజయ్ మాస్టర్ ప్లాన్ వెనుక నిజం ఏంటి?
-
Sun TV Share Price: తమిళనాడులో విజయ్ సునామీ.. సన్ టీవీ షేర్లు పతనం.. ఎందుకు?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!