Site icon NTV Telugu

IND vs PAK T20 World Cup: భారత్ వర్సెస్ పాక్: 2026 టీ20 వరల్డ్ కప్లో ఎన్నిసార్లు తలపడనున్నారు..?

Ind Vs Pak

Ind Vs Pak

IND vs PAK T20 World Cup: 2026 సంవత్సరం క్రికెట్ అభిమానులకు ఒక పండుగలా మారబోతుంది. అండర్-19 వరల్డ్ కప్ నుంచి మెన్స్ టీ20 వరల్డ్ కప్, మహిళల టీ20 వరల్డ్ కప్ వరకూ అన్ని వర్గాలు, అన్ని విభాగాల్లో ప్రపంచ స్థాయి పోటీలు జరగబోతున్నాయి. ఈ టోర్నీల్లో అత్యంత ఆసక్తిగా ఎదురు చూసే మ్యాచ్ ఎదైనా ఉందంటే అది కేవలం భారత్-పాకిస్థాన్ మధ్య పోరే. గత ఏడాది 2025లో కూడా ఇరు జట్లు పలు టోర్నీల్లో పరస్పరం తలపడ్డాయి. చాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్‌లో మూడు సార్లు, మహిళల వన్డే వరల్డ్ కప్, అండర్-19 ఆసియా కప్‌లోనూ భారత్-పాక్ తలపడటం అభిమానులను ఉర్రూతలూగించాయి. 2026లో కూడా ఈ రెండు బద్ద శత్రువుల మధ్య పోరు కొనసాగనుంది.

Read Also: Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

మెన్స్ టీ20 వరల్డ్ కప్‌లో భారత్–పాక్ సమరం
2026 మెన్స్ టీ20 వరల్డ్ కప్‌లో భారత్, పాకిస్థాన్ జట్లు తొలిసారి ఫిబ్రవరి 15వ తేదీన తలపడనున్నాయి. ఈ కీలక మ్యాచ్ శ్రీలంకలోని కొలంబోలో ఉన్న ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరగనుంది. ఇది గ్రూప్ దశలో జరిగే మ్యాచ్ కాగా, భారత్ ఈ టోర్నీలో ఆడే ఏకైక విదేశీ మ్యాచ్ ఇదే కావడం విశేషం. గ్రూప్ దశలోనే కాకుండా ఇరు జట్లు సెమీఫైనల్ లేదా ఫైనల్‌కు అర్హత సాధిస్తే మరోసారి ముఖాముఖి పోటీపడే ఛాన్స్ కూడా ఉంది. దీంతో టీ20 వరల్డ్ కప్‌లో భారత్- పాకిస్థాన్ మ్యాచ్‌లపై అంచనాలు ఇప్పటికే భారీగా పెరిగాయి.

Read Also: TheRajaSaab : రాజాసాబ్ రన్ టైమ్ ఏకంగా నాలుగు గంటలపైనే : మారుతీ

అండర్-19 మెన్స్ వరల్డ్ కప్‌లో పోరాడే అవకాశం..
అండర్-19 మెన్స్ వరల్డ్ కప్‌లో భారత్, పాకిస్థాన్ నేరుగా లీగ్ దశలో తలపడే అవకాశం లేదు. డ్రా ప్రకారం గ్రూప్-Aలో భారత్, గ్రూప్-Bలో పాకిస్థాన్ ఉన్నాయి. అందువల్ల లీగ్ దశలోనూ, సూపర్ సిక్సెస్‌లోనూ ఇరు జట్లు ముఖాముఖి పోటీ పడే ఛాన్స్ లేదు. కానీ, సెమీఫైనల్ లేదా ఫైనల్‌కు రెండు జట్లు చేరితే మాత్రమే భారత్-పాక్ మధ్య పోరు చూసే అవకాశం ఉంది.

Read Also: Hyderabad Fog: కాశ్మీర్ను తలపించేలా హైదరాబాద్.. శివారు ప్రాంతాలను కమ్మేసిన పొగమంచు..

మహిళల టీ20 వరల్డ్ కప్‌లో హోరాహోరీ
2025లో జరిగిన మహిళల వన్డే వరల్డ్ కప్‌లో ట్రోఫీని గెలిచిన భారత మహిళల జట్టు.. 2026లో ఇంగ్లండ్‌ వేదికగా జరిగే మహిళల టీ20 వరల్డ్ కప్‌లో తమ తొలి టైటిల్‌ను గెలుచుకోవాలని ఆశిస్తోంది. ఈ టోర్నీలో భారత్, పాకిస్థాన్ ఒకే గ్రూప్‌లో ఉండడం విశేషం. జూన్ 14వ తేదీన ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇరు జట్ల మధ్య గ్రూప్ మ్యాచ్ జరగనుంది. అలాగే, రెండు జట్లు సెమీఫైనల్ లేదా ఫైనల్‌కు చేరితే మరోసారి కీలక పోరులో తలపడే ఛాన్స్ ఉంది. కాబట్టి, మొత్తంగా 2026లో మెన్స్, మహిళల, జూనియర్ క్రికెట్ స్థాయిల్లో భారత్-పాక్ మ్యాచ్‌లు క్రికెట్ అభిమానులకు పండుగ వాతావరణాన్ని సృష్టించనున్నాయి. ప్రతి మ్యాచ్‌పై ఉత్కంఠతను తారాస్థాయికి పెంచేలా కనిపిస్తోంది. క్రికెట్ ప్రపంచంలో ఉత్కంఠభరితమైన ఈ బద్ద శత్రువులు 2026లో జరిగే అన్ని టోర్నీలను కలిపి సుమారు 8 సార్లు పోటీ పడే అవకాశం ఉంది.

Exit mobile version