Site icon NTV Telugu

IND vs SA T20i: సౌతాఫ్రికాతో టీ20 సిరీస్.. ఇదే భారత జట్టు!

Team India

Team India

IND vs SA T20i: దక్షిణాఫ్రికా- భారత్ జట్ల మధ్య డిసెంబర్ 9వ తేదీ నుంచి ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ ప్రారంభం కాబోతుంది. ఈ సిరీస్ కోసం టీమిండియా సెలక్టర్లు జట్టును తాజాగా ప్రకటించారు. ఈ సిరీస్‌లో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా పునరాగమనం చేస్తున్నాడు. ఈ సిరీస్ కు రింకు సింగ్‌పై వేటుపడినట్లైంది. సఫారీలతో టెస్టు సిరీస్‌లో మెడ నొప్పితో మైదానాన్ని వీడిన గిల్‌ను టీ20 సిరీస్‌కు ఎంపిక చేశారు. బీసీసీఐ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఫిట్‌నెస్ క్లియరెన్స్ ఇస్తే శుభ్‌మన్ గిల్ మ్యాచ్‌లు ఆడతాడు.

Read Also: Pyyavula Keshav: ప్రతి అర్జీకి పరిష్కారం చూపించాల్సిందే..

టీమిండియా తుది జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబె, అక్షర్ పటేల్, జితేశ్‌ శర్మ, సంజూ శాంసన్, జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, కుల్‌దీప్ యాదవ్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్.

ఐదు టీ20ల సిరీస్‌ల పూర్తి షెడ్యూల్
* 1st టీ20 – డిసెంబర్ 9 (కటక్)
* 2nd టీ20 – డిసెంబర్ 11 (ముల్లాన్‌పూర్)
* 3rd టీ20 – డిసెంబర్ 14 (ధర్మశాల)
* 4th టీ20 – డిసెంబర్ 17 (లఖ్‌నవూ)
* 5th టీ20 – డిసెంబర్ 19 (అహ్మదాబాద్)

Exit mobile version