Team India Squad: టీమిండియాలో పెను మార్పులు.. రాహుల్, పంత్, జడేజా భవిష్యత్తుపై అనిశ్చితి!
- టీమిండియాలో పెను మార్పులు
- రాహుల్, పంత్, జడేజా భవిష్యత్తుపై అనిశ్చితి
- యువ ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Team India ODI Squad Changes for 2027 ODI World Cup: భారత వన్డే జట్టులో త్వరలోనే కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. సీనియర్ ఆటగాళ్లు కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజాలు భవిష్యత్తులో భారత జట్టు వన్డే ప్రణాళికల్లో ఉండకపోవచ్చని సమాచారం. 2027 వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకుని.. బీసీసీఐ సెలెక్టర్లు కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్లాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2026 సీజన్ ముగిసిన తర్వాత వన్డే జట్టు ఎంపికపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందట.
2027 వరల్డ్ కప్ కోసం అత్యున్నత భారత జట్టును సిద్ధం చేయాలనే ఉద్దేశంతో యువ ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఇప్పటికే తన చివరి వన్డే మ్యాచ్ ఆడేసి ఉండొచ్చని కూడా క్రికెట్ వర్గాలు అంటున్నాయి. జట్టు యాజమాన్యం ఇప్పుడు యువ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్లపై దృష్టి పెట్టాలని భావిస్తోందట. అక్షర్ పటేల్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్ లాంటి ప్లేయర్స్ ఇప్పటికే నిరూపించుకున్నారు. టీ20 వరల్డ్ కప్ 2026లో దూబే అద్భుతంగా ఆడిన విషయం తెలిసిందే.
Also Read
- MS Dhoni: భారత క్రికెట్ చరిత్రలో నేడు ప్రత్యేకమైన రోజు.. ప్రపంచంలోనే ఏకైక కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీ చరిత్ర!
- India vs Ireland: టీమిండియాకు మరో బిగ్ షాక్.. ఐర్లాండ్, ఇంగ్లాండ్ సిరీస్‌లకు యువ ఆల్‌రౌండర్ దూరం!
- Virat Kohli Diet: ఒకప్పుడు మాంసాహారి.. ఇప్పుడు కఠిన శాకాహారి.. విరాట్ జీవితాన్ని మార్చింది ఎవరు?
- Vaibhav Sooryavanshi Jersey: వైభవ్ సూర్యవంశీ చేతికి టీమిండియా జెర్సీ.. బుడ్డోడికి దిగ్గజాల జెర్సీ నంబర్!
Also Read: AP Cabinet 2026: నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. అభివృద్ధి ప్రాజెక్టులు, భూముల కేటాయింపులకు ఆమోదం!
మరోవైపు 2027 వరల్డ్ కప్ దక్షిణాఫ్రికాలో జరగనుంది. అక్కడి పిచ్‌లపై వేగం, బౌన్స్ కీలకంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో వికెట్‌కీపర్ బ్యాట్స్‌మెన్‌లుగా సంజు శాంసన్, ఇషాన్ కిషన్‌లకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని సెలెక్టర్లు భావిస్తున్నారట. గాయాలు, ఫిట్‌నెస్, ఫామ్ లేని రిషబ్ పంత్ మెగా టోర్నీకి దాదాపుగా దూరమయినట్లే. యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ ఓపెనర్లుగా ఆడుతారు. దాంతో కేఎల్ రాహుల్ కూడా అనుమానమే. విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్, టపార్డర్లో ఆడుతారు. శ్రేయాస్ అయ్యర్, హార్దిక్ పాండ్య, శివమ్ దూబే, సంజు శాంసన్, ఇషాన్ కిషన్‌లు మిడిల్ ఆర్డర్లో ఉన్నారు. మొత్తానికి టీమిండియా వన్డే జట్టులో పెను మార్పులు చోటు చేసుకునే అవకాశముందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. యువ ఆటగాళ్లతో కొత్త జట్టును తయారు చేసి 2027 వరల్డ్ కప్‌కు సిద్ధం కావాలనే లక్ష్యంతో బీసీసీఐ ఈ నిర్ణయాలు తీసుకునే అవకాశముందని తెలుస్తోంది.
తాజావార్తలు
-
MS Dhoni: భారత క్రికెట్ చరిత్రలో నేడు ప్రత్యేకమైన రోజు.. ప్రపంచంలోనే ఏకైక కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీ చరిత్ర!
-
సాగుకు బ్రేక్..రైతులకు కన్నీరు.. భారీగా పడిపోయిన వర్షపాతం.. కారణాలివే!
-
Exclusive : అన్న కొడుకు సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు అతిధిగా సూపర్ స్టార్ మహేశ్ బాబు
-
Explainer: ఈసారి మహిళా బిల్లు పాస్ కావడం ఖాయం… మోడీ లెక్క ఇదే!
-
Medak Double Murder Case: ప్రాణ స్నేహితుల మధ్య చిచ్చు పెట్టిన EMI.. మెదక్‌లో జంట హత్యల కలకలం..
ట్రెండింగ్
-
11,000mAh భారీ బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్, IP69K రేటింగ్ ప్రత్యేకతలతో HONOR X80 Pro Max లాంచ్.! ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi Jersey: వైభవ్ సూర్యవంశీ చేతికి టీమిండియా జెర్సీ.. బుడ్డోడికి దిగ్గజాల జెర్సీ నంబర్!
-
Vaibhav Suryavanshi: అది మంచి పద్ధతి కాదు.. వైభవ్ అలా చేయాల్సింది కాదు!
-
CBSE రీవాల్యుయేషన్లో అద్భుతం.. 500కు 500 మార్కులు సాధించిన ‘అవ్ని కేజ్రీవాల్’.!
-
జియో, ఎయిర్‌టెల్‌కు BSNL చెక్మెట్.. రోజుకు 2.5GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్‌తో కొత్త ప్లాన్ లాంచ్.!