జియో, ఎయిర్‌టెల్‌కు BSNL చెక్మెట్.. రోజుకు 2.5GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్‌తో కొత్త ప్లాన్ లాంచ్.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BSNL Rs 225 Prepaid Plan Launched: ప్రభుత్వ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ (BSNL) వినియోగదారుల కోసం మరో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను లాంచ్ చేసింది. కేవలం రూ.225తో లభించే ఈ సరికొత్త ప్లాన్‌లో అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజువారీ డేటా, ఉచిత SMSలతో పాటు 30 రోజుల వ్యాలిడిటీని అందిస్తోంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలు కావాలనుకొనే వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ఈ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్లాన్ కు బిఎస్ఎన్ఎల్ “సిల్వర్ జూబ్లీ” గా నామకరణం చేశారు.
ఈ రూ.225 రీచార్జ్ ప్లాన్‌లో 30 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. దేశవ్యాప్తంగా ఏ నెట్‌వర్క్‌కైనా అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. అంతేకాకుండా నేషనల్ రోమింగ్ కూడా పూర్తిగా ఉచితం. డేటా విషయానికి వస్తే.. రోజుకు 2.5GB హైస్పీడ్ డేటా లభిస్తుంది. దీంతో 30 రోజుల కాలంలో మొత్తం 75GB డేటాను వినియోగించుకోవచ్చు. అలాగే ప్రతిరోజూ 100 ఉచిత SMSలు కూడా వినియోగించుకోవచ్చు. ఎక్కువగా కాల్స్, మెసేజ్‌లు ఉపయోగించే వినియోగదారులకు ఈ ప్లాన్ బెస్ట్ ఎంపిక.
Also Read
- Abhishek Sharma: షాకింగ్ డెసిషన్.. సన్ రైజర్స్ హైదరాబాద్‌ను వీడనున్న అభిషేక్ శర్మ..?
- USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- Teacher Posts: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎం పోస్టుల కేడర్ ఫిక్స్.
కొత్త వినియోగదారులకు రూ.51 స్పెషల్ ప్లాన్:
ఇక కొత్త వినియోగదారులను ఆకర్షించేందుకు బిఎస్ఎన్ఎల్ ప్రత్యేకంగా రూ.51 రీచార్జ్ ప్లాన్‌ను లాంచ్ చేసింది. ఈ ఆఫర్ జూన్ 30 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. కొత్తగా BSNL సిమ్ తీసుకునే వినియోగదారులు ఈ ప్లాన్‌ను ఉపయోగించుకోవచ్చు. ఈ రూ.51 ప్లాన్‌లో 28 రోజుల వ్యాలిడిటీతో పాటు అన్లిమిటెడ్ కాల్స్, ఉచిత నేషనల్ రోమింగ్, రోజుకు 2GB డేటా, ప్రతిరోజూ 100 SMSలు లభిస్తాయి. అంతేకాకుండా కొత్త కస్టమర్లకు ఉచిత సిమ్ కార్డు కూడా అందించనున్నట్లు కంపెనీ తెలిపింది.
ప్రైవేట్ టెలికాం కంపెనీలతో పోటీని తట్టుకునేందుకు BSNL దేశవ్యాప్తంగా తన నెట్‌వర్క్‌ను విస్తృతం చేస్తోంది. ఒకవైపు తక్కువ ధరల్లో మంచి ప్లాన్లు అందిస్తూనే.. మరోవైపు నెట్వర్క్ నాణ్యతను మెరుగుపరచడంపై దృష్టి పెట్టింది.
- Tags
- Airtel
- BSNL
- Jio
- Telecom News
- VI
తాజావార్తలు
-
Abhishek Sharma: షాకింగ్ డెసిషన్.. సన్ రైజర్స్ హైదరాబాద్‌ను వీడనున్న అభిషేక్ శర్మ..?
-
Om: ధనుష్ – సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
-
ECIL Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫీజు, ఎగ్జామ్ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం! వెంటనే అప్లై చేసుకోండి..
-
USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
-
Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!