Virat Kohli Diet: ఒకప్పుడు మాంసాహారి.. ఇప్పుడు కఠిన శాకాహారి.. విరాట్ జీవితాన్ని మార్చింది ఎవరు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli Diet : భారత క్రికెట్లో ఫిట్‌నెస్‌కు కొత్త నిర్వచనం చెప్పిన ఆటగాడు ఎవరంటే చాలా మంది వెంటనే విరాట్ కోహ్లీ పేరే చెబుతారు. ఒకప్పుడు చోలే భటూరే, రాజ్మా చావల్ వంటి రుచికరమైన వంటకాలను ఇష్టపడే ఫుడ్ లవర్‌గా ఉన్న విరాట్.. ఇప్పుడు అత్యంత క్రమశిక్షణతో కూడిన ఆహార నియమాలను పాటిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఫిట్నెస్ ఐకాన్‌గా నిలిచాడు. అతని శరీరాకృతి, ఎనర్జీ లెవెల్స్, మైదానంలో చూపించే చురుకుదనం వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటి? ఈ మార్పు ఒక్కసారిగా జరిగిందా? లేక మరేదైనా ఉందా ? అనే ప్రశ్నలు అభిమానుల్లో ఎప్పుడూ ఆసక్తిని రేకెత్తిస్తూనే ఉంటాయి. మరి అసలు విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
రీసెంట్ గా సెలబ్రిటీ చెఫ్ అరుణ్ చౌహాన్ వెల్లడించిన వివరాలు ప్రకారం, కెరీర్ ప్రారంభ దశలో విరాట్ పూర్తిస్థాయి తిండిపోతు. చోలే భటూరే, రాజ్మా చావల్ వంటి ఉత్తర భారత వంటకాలంటే అతనికి ప్రత్యేకమైన ఇష్టం. అంతేకాదు, అప్పట్లో మాంసాహారం కూడా తరచూ తీసుకునేవాడు. అయితే కాలక్రమేణా తన జీవనశైలిని పూర్తిగా మార్చుకుని కఠినమైన శాకాహార విధానాన్ని ఎంచుకున్నాడు. ఈ మార్పు వెనుక అనుష్క శర్మ ప్రభావం కూడా ఉందని చెఫ్ వెల్లడించారు. విరాట్ లో ఆలోచనా విధానం, జీవనశైలి, ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుకు అనుష్క ప్రేరణగా నిలిచిందని చెప్పాడు. ఒకప్పుడు శరీరంలో కండరాలు పెంచుకోవాలనే ఉద్దేశంతో ట్రైనర్ సూచన మేరకు రెడ్ మీట్ ఎక్కువగా తీసుకునేవాడినని, మధ్యాహ్న భోజనంలో గ్రిల్డ్ చికెన్, మాష్డ్ పొటాటోస్, పాలకూర, కూరగాయలు, రాత్రి భోజనంలో సీఫుడ్ తరచుగా ఉండేదని విరాట్ పాత ఇంటర్వ్యూలలో చెప్పడం కూడా జరిగింది.
Also Read
- Chamari Athapaththu: కెప్టెన్ సంచలనం.. 5 పరుగులిచ్చి 7 వికెట్లు డౌన్..! హ్యాట్రిక్ కూడాను..
- ICC Cricket World Cup 2027: ప్రపంచకప్‌లో టీమ్ఇండియా ఎక్స్‌ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
- ICC Women's Champions Trophy 2027: మహిళల క్రికెట్లో కొత్త చరిత్ర.. ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ ఆతిథ్యం.. తేదీలు ఖరారు
- Quinton de Kock: 106 పరుగుల విధ్వంసం.. కోహ్లీ, వార్నర్ సరసన డి కాక్.. టీ20ల్లో అరుదైన రికార్డు
ప్రస్తుతం మాత్రం అతని ఆహారపు అలవాట్లు పూర్తిగా మారిపోయాయి. పనీర్‌కు బదులుగా టోఫూను ప్రాధాన్యంగా తీసుకుంటూ, సలాడ్లు, మొలకలు, పప్పులు, తాజా కూరగాయలను రోజువారీ ఆహారంలో భాగం చేసుకుని పూర్తి శాకాహారిగా మారిపోయాడు విరాట్. అయితే ఇన్ని మార్పులు వచ్చినా తన చిన్ననాటి ఇష్టమైన చోలే భటూరేపై ప్రేమ మాత్రం తగ్గలేదట. అవకాశం దొరికితే దానిని ‘చీట్ మీల్’గా ఇప్పటికీ ఆస్వాదించాలని అనుకుంటాడని చెఫ్ తెలిపారు. క్రికెట్లో రికార్డులతో పాటు ఫిట్‌నెస్‌లోనూ ఆదర్శంగా నిలిచిన విరాట్ కోహ్లీ ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తిగా మారింది. ఆహారపు అలవాట్లు మార్చుకుంటే శరీరంలోనే కాదు, ఆలోచనల్లో కూడా ఎంత పెద్ద మార్పు వస్తుందో అతని జీవితం మరోసారి నిరూపిస్తోంది. ఇక మైదానంలో అదే ఫిట్నెస్తో ఇంకా ఎన్నో రికార్డులు సృష్టించాలని అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజావార్తలు
-
Kurnool DSC: టెట్ అర్హత లేకుండానే టీచర్ ఉద్యోగం.. కర్నూలులో వెలుగులోకి సంచలన వ్యవహారం!
-
EMI Movie: ఫోన్, బైక్ కొన్నారా? గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న ప్రతి నెలా ‘ఇ.ఎం.ఐ’ టెన్షన్
-
BKU : తెలుగులో బెత్లెహం కుడుంబ యూనిట్.. మరో ప్రేమలు అవుతుందా..?
-
Jitendra Mishra: ఆపరేషన్ సింధూర్ హీరోకి రామ మందిర సేవా భాగ్యం.. జితేంద్ర మిశ్రాపై బిగ్ రెస్పాన్సిబిలిటీ!
-
AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. 40కి పైగా అజెండా అంశాలతో భేటీ!
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!