India vs Ireland: టీమిండియాకు మరో బిగ్ షాక్.. ఐర్లాండ్, ఇంగ్లాండ్ సిరీస్‌లకు యువ ఆల్‌రౌండర్ దూరం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs Ireland: ఐర్లాండ్‌తో జూన్ 26 నుంచి ప్రారంభం కానున్న రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ముందు టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఐపీఎల్ 2026 తర్వాత గాయం కారణంగా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఇప్పటికే జట్టుకు దూరం కాగా.. ఇప్పుడు అతనికి ప్రత్యామ్నాయంగా భావిస్తున్న యువ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి సైతం గాయం కారణంగా ఐర్లాండ్ టూర్‌కు దూరం కానున్నాడు. అంతేకాదు.. నితీష్ ఇంగ్లాండ్ పర్యటనపై కూడా నీలి నీడలు కమ్ముకున్నాయి. గాయం తీవ్రత దృష్ట్యా అతను ఇంగ్లాండ్‌తో జరగబోయే టీ20, వన్డే సిరీస్‌లకు కూడా దూరం కావచ్చునని తెలుస్తోంది.
బీసీసీఐ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం.. నితీష్ రెడ్డి ఎడమ క్వాడ్రిసెప్స్ (తొడ కండరాల) గాయంతో బాధపడుతున్నాడు. దీనివల్లనే అతను ఐర్లాండ్ సిరీస్‌తో పాటు ఇంగ్లాండ్ పర్యటనలోని వైట్ బాల్ సిరీస్‌లకు సైతం అందుబాటులో ఉండటం కష్టమేనని పీటీఐ (PTI) నివేదించింది. ఇటీవల ముగిసిన భారత్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ వన్డే సిరీస్‌లో నితీష్ భాగమయ్యాడు. ఆ సిరీస్‌లో మొదటి, మూడో మ్యాచ్ ఆడిన అతను, జట్టు కాంబినేషన్, ఇతర ఆటగాళ్లకు అవకాశం ఇచ్చే క్రమంలో రెండో మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడు. అయితే, ఐపీఎల్ 2026 సీజన్ మొత్తంలో దాదాపు అన్ని మ్యాచ్‌లు ఆడాడు. ప్రస్తుత సమాచారం ప్రకారం.. నితీష్ రెడ్డి స్థానంలో సూర్యాంశ్ శెడ్గేను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. భారత క్రికెట్లో హార్దిక్ పాండ్యాకు సరైన ‘లైక్-టు-లైక్’ రీప్లేస్మెంట్ ఎవరైనా ఉన్నారంటే అది నితీష్ రెడ్డి మాత్రమే. అలాంటి ఆటగాడు గాయపడటం టీమిండియాకు పెద్ద మైనస్. ప్రస్తుతం భారత డొమెస్టిక్ సర్క్యూట్లో మంచి వేగంతో బౌలింగ్ చేస్తూ, మ్యాచ్‌ను ముగించగల సత్తా ఉన్న పేస్ ఆల్‌రౌండర్లు ఎవరూ అందుబాటులో లేకపోవడం సెలెక్టర్లకు తలనొప్పిగా మారింది. ఈ పరిస్థితుల్లో బీసీసీఐ ఐర్లాండ్ సిరీస్ కోసం ఎవరిని ఎంపిక చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఈ స్థానానికి సరిపోయే బలమైన పేర్లు ఏవీ రేసులో కనిపించడం లేదు.
Also Read
- Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
- GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
ఇక, భారత్, ఐర్లాండ్ మధ్య ఈ రెండు టీ20 మ్యాచ్‌లు బెల్ఫాస్ట్లో జరగనున్నాయి. మొదటి మ్యాచ్ జూన్ 26 శుక్రవారం, రెండో మ్యాచ్ జూన్ 28 ఆదివారం నిర్వహిస్తారు. ఈ యూకే పర్యటనలో భాగంగా ఆ తర్వాత భారత్, ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. జూలై 1 నుంచి జూలై 11 వరకు ఈ టీ20లు జరుగుతాయి. అనంతరం జూలై 14 నుంచి 19 వరకు మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరగనుంది. ఈ మూడు సిరీస్‌లకు నితీష్ రెడ్డి దూరం కావడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే, ఇటీవల ప్రకటించిన వన్డే జట్టులో వరుణ్ చక్రవర్తి స్థానంలో హర్షిత్ రాణాను చేర్చిన సంగతి తెలిసిందే.
తాజావార్తలు
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!