Medak Double Murder Case: ప్రాణ స్నేహితుల మధ్య చిచ్చు పెట్టిన EMI.. మెదక్‌లో జంట హత్యల కలకలం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Medak Double Murder Case: మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం సురారం గ్రామంలో తీవ్ర కలకలం రేపిన జంట హత్యల కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. గతంలో ప్రాణ స్నేహితులైన శ్రీధర్, ప్రభు (ప్రభాకర్) మధ్య ఉన్న చిన్నపాటి ఆర్థిక వివాదం, ఆపై కుటుంబ గొడవలే ఈ దారుణ హత్యలకు దారితీశాయి. పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం.. శ్రీధర్, ప్రభు గతంలో అత్యంత సన్నిహితంగా ఉండేవారు. ప్రభు బంధువుల నుంచి శ్రీధర్ ఒక ఆటోను ఈఎంఐ (EMI) పద్ధతిలో తీసుకున్నాడు. అయితే, రెండు నెలల ఈఎంఐ బకాయిల విషయంలో వీరిద్దరి మధ్య గొడవ మొదలైంది. ఈ క్రమంలోనే గతంలో ప్రభు.. శ్రీధర్‌పై హత్యాయత్నానికి కూడా పాల్పడగా, అప్పట్లో పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ గొడవ ఇలా ఉండగానే, శ్రీధర్‌కు వరుసకు చెల్లెలు అయ్యే అమ్మాయిని ప్రభు రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ వివాహంతో ఇద్దరి మధ్య మనస్పర్ధలు, పగ మరింత తీవ్రరూపం దాల్చాయి.
మాట్లాడుకుందామని పిలిచి హత్య..
ఈ వివాదాలను పరిష్కరించుకోవడానికి నిన్న ఇద్దరూ ఒకచోట కలుసుకుని మాట్లాడుకుందామని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ఒకరికొకరు లొకేషన్లు షేర్ చేసుకున్నారు. ఈ క్రమంలో చేగుంట మండలం అనంతసాగర్ వద్దకు శ్రీధర్ బైక్‌పై రాగానే.. అప్పటికే పథకం ప్రకారం అక్కడ వేచి ఉన్న ప్రభు, అతని స్నేహితులు ఆటోతో శ్రీధర్ బైక్‌ను బలంగా ఢీకొట్టారు. అనంతరం శ్రీధర్‌ను దారుణంగా హతమార్చి అక్కడి నుంచి పరారయ్యారు. కన్నకొడుకు శ్రీధర్ హత్యకు గురయ్యాడనే విషయం తెలవడంతో ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు ప్రతీకారంతో రగిలిపోయారు. ప్రభుపై కక్షతో అర్ధరాత్రి వేళ అతని తండ్రి యాదగిరిని టార్గెట్ చేసి దారుణంగా హత్య చేశారు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు యాదగిరి మృతదేహాన్ని మాసాయిపేట మండలం కొప్పులపల్లి గ్రామ శివారులోని హల్దీవాగులో పడేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాలకు చేరుకుని దర్యాప్తు చేపట్టారు. శ్రీధర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, హల్దీవాగు నుంచి వెలికితీసిన యాదగిరి మృతదేహాన్ని నర్సాపూర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ జంట హత్యల నేపథ్యంలో సురారం గ్రామంలో మళ్లీ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ ఆధ్వర్యంలో భారీగా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేసి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
Also Read
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!