BCCI: కోచ్‌గా అతడు తాత్కాలికమే.. పనితీరు నచ్చితేనే టీమిండియాలో ఉంటాడు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BCCI On Team India Fielding Coach Subhadeep Ghosh: టీమిండియా సీనియర్ పురుషుల జట్టు సెలక్షన్ కమిటీలో కీలక మార్పు చోటుచేసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో.. ఆయన స్థానంలో కొత్త చీఫ్ సెలెక్టర్‌ను నియమించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం. అగార్కర్ తన పదవీకాలం ముగిసిన తర్వాత బాధ్యతల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
అజిత్ అగార్కర్ పదవీకాలం మరికొద్ది వారాల్లో ముగియనుంది. 2027 వన్డే ప్రపంచ కప్ వరకు తన పదవీకాలాన్ని పొడిగించాలని ఆయన బీసీసీఐని కోరినట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం.. ప్రస్తుత పదవీకాలం పూర్తయిన వెంటనే చీఫ్ సెలెక్టర్ బాధ్యతల నుంచి తప్పుకోవాలనే ఉద్దేశాన్ని బీసీసీఐకి అగార్కర్ వెల్లడించినట్లు తెలుస్తోంది. అగార్కర్, బీసీసీఐ మధ్య ఇప్పటికే చర్చలు జరిగినట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇప్పటికే అగార్కర్ చివరి సెలక్షన్ సమావేశానికి అధ్యక్షత వహించినట్లు తెలుస్తోంది. వెస్టిండీస్ వైట్‌బాల్ సిరీస్‌లకు భారత జట్టును ప్రకటించిన సమావేశమే అగార్కర్ చివరి సెలక్షన్ మీటింగ్ కానుంది.
Also Read
- Team India Mission 300: టీమిండియా ‘మిషన్ 300’.. ఇక ప్రత్యర్థులకు దబిడిదిబిడే!
- Travis Head-Abhishek: కాటేరమ్మ కొడుకుల విశ్వరూపం.. ఇటు అభిషేక్, అటు ట్రావిస్ హెడ్.. బాదుడే బాదుడు..
- BCCI కీలక నిర్ణయాలు.. లైంగిక వేధింపులపై కొత్త కమిటీ, IPL 2027పై ఫోకస్
- ICC T20 Rankings: ఆఫ్ఘనిస్థాన్‌ను క్లీన్‌స్వీప్ చేసినా ఉపయోగం లేకపాయే.. నంబర్ 1 స్థానం ఫసక్..!
అగార్కర్ స్థానాన్ని భర్తీ చేసేందుకు మాజీ టీమిండియా క్రికెటర్ పార్థివ్ పటేల్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ పదవికి పార్థివ్ ప్రధాన అభ్యర్థుల్లో ఒకరిగా ఉన్నట్లు సమాచారం. అయితే తుది నిర్ణయం మాత్రం బీసీసీఐ ప్రక్రియ పూర్తయిన తర్వాతే వెల్లడికానుంది. సీనియర్ సెలక్షన్ కమిటీతో పాటు జూనియర్ సెలక్షన్ కమిటీలోనూ మార్పులు జరగనున్నాయి. జూనియర్ సెలక్షన్ కమిటీలోని మొత్తం ఐదు స్థానాలను భర్తీ చేసేందుకు బీసీసీఐ ప్రక్రియ చేపట్టింది. ఈ పదవుల కోసం పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చినట్లు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా వెల్లడించారు.
మరోవైపు టీమిండియా ఫీల్డింగ్ కోచ్‌గా సుభదీప్ ఘోష్ నియామకం కూడా ప్రస్తుతం తాత్కాలిక ప్రాతిపదికన ఉన్నట్లు దేవజిత్ సైకియా స్పష్టం చేశారు. బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఫీల్డింగ్ కోచ్‌గా ఉన్న ఘోష్‌ను భారత జట్టు ఫీల్డింగ్ కోచ్‌గా స్వల్పకాలికంగా నియమించినట్లు తెలిపారు. ‘ఘోష్ పనితీరును పరిశీలిస్తాం. టీమ్ మేనేజ్మెంట్కు చెందిన సంబంధిత వ్యక్తుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని భారత జట్టు ఫీల్డింగ్ కోచ్‌గా ఆయన సేవలను కొనసాగించాలా లేదా అనే దానిపై నిర్ణయం తీసుకుంటాం. తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదు’ అని దేవజిత్ సైకియా పేర్కొన్నారు.
తాజావార్తలు
-
BCCI: కోచ్‌గా అతడు తాత్కాలికమే.. పనితీరు నచ్చితేనే టీమిండియాలో ఉంటాడు!
-
Amaravati: రాజధానికి మాస్ ట్రాన్స్‌పోర్టేషన్ ప్రణాళిక.. సీఆర్డీఏ కీలక నిర్ణయం
-
TRAI Tightens Spam Call Rules:స్పామ్ కాల్స్‌పై ట్రాయ్ కఠిన నిబంధనలు.. AIతో ఫేక్ నంబర్ల గుర్తింపు, భారీ జరిమానాలు!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
Team India Mission 300: టీమిండియా ‘మిషన్ 300’.. ఇక ప్రత్యర్థులకు దబిడిదిబిడే!
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..