Team India: ఈ ఏడాది టీ20ల్లో టీమిండియా హవా.. ఒక్క ఓటమి కూడా లేదు..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Team India: ఈ ఏడాది టీ20ల్లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగిస్తోంది. 2022లో జరిగిన అన్ని ద్వైపాక్షిక టీ20 సిరీస్‌ల్లో భారత్ విజయాలు సాధించింది. అటు స్వదేశంలో, ఇటు విదేశాల్లో జరిగిన అన్ని టీ20 సిరీస్‌లను ఓటమి అనేది లేకుండా ముగించింది. వెస్టిండీస్, శ్రీలంక, ఐర్లాండ్, ఇంగ్లండ్, వెస్టిండీస్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలతో టీ20 సిరీస్‌లు సొంతం చేసుకుని ఐసీసీ ర్యాంకుల్లో నంబర్ వన్ జట్టుగా కొనసాగుతోంది. ద్వైపాక్షిక సిరీస్‌లలో ఓటమి అనేది లేకుండా సాగుతున్న టీమిండియా ఆసియా కప్‌లో మాత్రం నిరాశపరిచింది. సూపర్-6లో వరుసగా పాకిస్థాన్, శ్రీలంకపై ఓడిపోయి ఫైనల్ రేసు నుంచి తప్పుకుంది. నిలకడ లేని జట్టుతో రానున్న టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా ఏం చేస్తుందో అన్న సందేహాలు మాత్రం అభిమానుల్లో తలెత్తుతున్నాయి.
Read Also: ఈ ఏడాది అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్లు
Also Read
- Shreyas Iyer Record: ఎంఎస్ ధోనీ రికార్డు బద్దలు.. ప్రపంచంలోనే తొలి కెప్టెన్‌గా శ్రేయస్ సరికొత్త చరిత్ర!
- Vaibhav Sooryavanshi Records: మూడు వరల్డ్ రికార్డులు బద్దలు కొట్టిన వైభవ్.. ఇక ఎవరికీ సాధ్యం కాదు!
- Sachin Tendulkar: "ఓటమి ఓకే కానీ మోసం నేరం”.. NEET విద్యార్థుల ఉద్యమంపై సచిన్ భావోద్వేగ సందేశం!
- Shreyas Iyer: ఆ ఇద్దరే మ్యాచ్ గెలిపించారు.. మాటలు రావడం లేదు.. తొలి విజయంపై శ్రేయస్ భావోద్వేగం!
ఈ ఏడాది ఫిబ్రవరిలో వెస్టిండీస్‌తో స్వదేశంలో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను 3-0తో భారత్ క్లీన్‌స్వీప్ చేసింది. అనంతరం ఫిబ్రవరి నెలాఖరులో శ్రీలంకతో సొంతగడ్డపై జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను కూడా వైట్ వాష్ చేసింది. స్వదేశంలో ఆగస్టులో దక్షిణాఫ్రికాతో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌ను 2-2తో డ్రాగా ముగించింది. జూన్ నెలలో ఐర్లాండ్‌తో జరిగిన రెండు టీ20ల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. అనంతరం ఇంగ్లండ్‌లో జూన్‌లో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను 2-1 తేడాతో గెలుచుకుంది. జూలై-ఆగస్టు నెలల్లో వెస్టిండీస్ గడ్డపై జరిగిన ఐదు టీ20ల సిరీస్‌ను 4-1 తేడాతో సొంతం చేసుకుంది. సెప్టెంబర్ నెలాఖరులో స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను 2-1 తేడాతో భారత్ కైవసం చేసుకోగా.. అక్టోబరులో దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను 2-1తేడాతో గెలుచుకుంది. ఈ మేరకు బీసీసీఐ ఓ ట్వీట్ చేసింది.
How about that for dominance! 💪 💪#TeamIndia pic.twitter.com/fB3OustQpC
— BCCI (@BCCI) October 4, 2022
తాజావార్తలు
-
Student Protest: నేడు రాష్ట్రవ్యాప్తంగా విద్యా సంస్థల బంద్..
-
Shreyas Iyer Record: ఎంఎస్ ధోనీ రికార్డు బద్దలు.. ప్రపంచంలోనే తొలి కెప్టెన్‌గా శ్రేయస్ సరికొత్త చరిత్ర!
-
Janani Dialogues 2026: భారతదేశపు పునరుత్పత్తి ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు.. ‘ఒయాసిస్ అకాడమీ’ ప్రారంభం
-
Ashok Sharma: తమ్ముడి భవిష్యత్తు కోసం కెరీర్‌నే త్యాగం చేసిన అన్నయ్య.. టీమిండియా క్యాప్ సాధించి కన్నీటిపర్యంతమైన అశోక్ శర్మ!
-
Trump Tariffs: మళ్లీ షాకిచ్చిన ట్రంప్.. భారత్ సహా 17 దేశాలపై అమెరికా అదనపు సుంకం..
ట్రెండింగ్
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 526 కి.మీ రేంజ్, Level-2 ADASతో Kia Syros EV లాంచ్.. రూ.13.49 లక్షల ప్రారంభ ధరతో.!
-
రూ.8,599కే 90Hz డిస్ప్లే, IR బ్లాస్టర్ ఫీచర్, మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీతో ZENO 100 Pro లాంచ్.. పవర్ బ్యాంక్‌లు కూడా.!
-
Vaibhav Sooryavanshi Records: మూడు వరల్డ్ రికార్డులు బద్దలు కొట్టిన వైభవ్.. ఇక ఎవరికీ సాధ్యం కాదు!
-
Water Manifestation Technique: “నీటి మానిఫెస్టేషన్ టెక్నిక్” అంటే ఏమిటి.? నిజంగా పనిచేస్తుందా.?
-
Shreyas Iyer: ఆ ఇద్దరే మ్యాచ్ గెలిపించారు.. మాటలు రావడం లేదు.. తొలి విజయంపై శ్రేయస్ భావోద్వేగం!