IND Vs ENG: పంత్, జడేజా సెంచరీలు.. తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులు చేసిన టీమిండియా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బర్మింగ్ హామ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులకు ఆలౌట్ అయ్యింది. తొలి రోజు పంత్ మెరుపు సెంచరీ చేయగా.. రెండో రోజు తొలి సెషన్లో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా సెంచరీని పూర్తి చేసుకున్నాడు. టెస్టుల్లో జడేజాకు ఇది మూడో సెంచరీ కాగా ఈ ఏడాది రెండో సెంచరీ. అటు ఓవర్సీస్లో మాత్రం జడేజాకు ఇదే తొలి సెంచరీ. అతడు 183 బంతుల్లో 13 ఫోర్ల సహాయంతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రవీంద్ర జడేజా సెంచరీ(104) చేయగానే అండర్సన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అటు కెప్టెన్ బుమ్రా 16 బంతుల్లో రెండు సిక్సులు, నాలుగు ఫోర్లతో 31 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇంగ్లండ్ బౌలర్లలో అండర్సన్ 5 వికెట్లు తీయగా.. పాట్స్ 2 వికెట్లు, బ్రాడ్, స్టోక్స్, రూట్ తలో వికెట్ సాధించారు.
Read Also: IND Vs ENG: ధోనీ, సచిన్ రికార్డులను బ్రేక్ చేసిన పంత్
Also Read
- Missi Jersey Auction: ఒకే వేలంలో మెస్సీ, రొనాల్డో ఫైట్.. ఊహించని ధరకు అమ్ముడైన దిగ్గజాల జెర్సీలు..
- Joe Root Record: ఒక్క పరుగుతో చేజారిన హిస్టరీ.. విరాట్ కోహ్లీ అరుదైన రికార్డును మిస్సయిన జో రూట్..
- IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
- US Open 2026: యూఎస్ ఓపెన్ 2026లో చరిత్రలోనే భారీ ప్రైజ్‌పూల్.. సింగిల్స్ విజేతకు రూ.52.65 కోట్లు
కాగా ఈ టెస్టులో 98 పరుగులకే టీమిండియా ఐదు వికెట్లు కోల్పోయిన దశలో పంత్, జడేజా ఆరో వికెట్‌కు 222 పరుగులు జోడించారు. టీమిండియా ఆరో వికెట్ తరఫున ఇది ఐదో అత్యుత్తమ భాగస్వామ్యం. 1986లో ఆస్ట్రేలియాపై రవిశాస్త్రి, వెంగ్ సర్కార్ ఆరోవికెట్‌కు 298 పరుగులు జోడించి ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. 1986లోనే అజారుద్దీన్, కపిల్ దేవ్ జోడీ శ్రీలంకపై ఆరో వికెట్‌కు 272 పరుగులు చేసి రెండో స్థానంలో, 2009లో ధోనీ, రాహుల్ ద్రవిడ్ శ్రీలంకపై 224 పరుగులు చేసి మూడో స్థానంలో, 1997లో అజారుద్దీన్, టెండూల్కర్ జోడీ దక్షిణాఫ్రికాపై 222 పరుగులు చేసి నాలుగో స్థానంలో ఉన్నారు.
Rishabh Pant and Ravindra Jadeja saved the day for India 🙌
How it happened 👉 https://t.co/p9SDgF6lA4#ENGvIND | #WTC23 pic.twitter.com/Ycs1RUSkEB
— ICC (@ICC) July 2, 2022
తాజావార్తలు
-
Shavukaru Janaki : వెండితెర ‘షావుకారు’ జానకి ఇకలేరు.. ఏడు పదుల సినీ ప్రస్థానానికి ముగింపు
-
Earthquakes: ఒక భూకంపం మరో భూకంపాన్ని ప్రేరేపిస్తుందా? ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనల వెనుక అసలు కారణం ఇదే..!
-
Vizag Job Fraud: విశాఖలో కిలాడీ లేడీ.. నిరుద్యోగులకు కుచ్చుటోపీ!
-
Arjun Reedy Ice Scene: ‘ఐస్ వేసుకునే సీన్’ రాగానే నిర్మాతలు ఆపెయ్యమనేవాళ్లు..!
-
Spirit: ‘స్పిరిట్’లో చిరంజీవి, డాన్ లీ ఉన్నారా..?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!