Punam Raut Retires: “చాలా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నా”.. రిటైర్మెంట్ ప్రకటనపై పూనమ్ భావోద్వేగం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Punam Raut Retires: “ఎంతో ఆలోచించుకున్నా. అన్నీ బాగా బేరీజు వేసుకున్న తర్వాతే అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను” అని భారత మహిళా క్రికెట్ జట్టు కీలక బ్యాటర్ పూనమ్ రౌత్ భావోద్వేగం వ్యక్తం చేసింది. భారత్‌కు ప్రాతినిధ్యం వహించడం తన జీవితంలోనే అత్యున్నత గౌరవమని, క్రికెట్ కేవలం ఆట మాత్రమే కాకుండా తన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దిందని చెప్పుకొచ్చింది. పట్టుదలను నేర్పిందని, జీవితాంతం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకాలను ఇచ్చిందని ఇన్స్టాగ్రామ్ వేదికగా తెలిపింది. భారత జెర్సీని ధరించిన ప్రతిసారీ ఎంతో గర్వంగా, కృతజ్ఞతా భావంతో మైదానంలో అడుగుపెట్టానని, దేశం కోసం ఆడాలనే తన కల నిజమైందని, తనకు అందిన మద్దతుకు ఎప్పటికీ రుణపడి ఉంటానని పేర్కొంది. భారత మహిళా క్రికెట్ జట్టు కీలక బ్యాటర్ పూనమ్ రౌత్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. బుధవారంతో 37 ఏళ్లు పూర్తి చేసుకున్న ఆమె, అన్ని ఫార్మాట్ల అంతర్జాతీయ క్రికెట్ నుంచి తక్షణమే తప్పుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. 2009 నుంచి 2021 వరకు టీమిండియా తరఫున ఆమె 4 టెస్టులు, 73 వన్డేలు, 35 టీ20 మ్యాచ్‌లు ఆడి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
ముఖ్యంగా భారత మహిళల జట్టు 2017 ప్రపంచ కప్ ఫైనల్‌కు చేరడంలో పూనమ్ రౌత్ కీలక పాత్ర పోషించింది. ఆ టోర్నమెంట్లో ఆమె 381 పరుగులు చేసింది. చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్‌తో జరిగిన ఫైనల్లో, భారత్ కేవలం తొమ్మిది పరుగుల తేడాతో ఓడిపోయినప్పటికీ, ఆమె 86 పరుగుల పోరాట పటిమతో కూడిన ఇన్నింగ్స్ ఆడింది. ఐర్లాండ్‌తో జరిగిన అదే ప్రపంచ కప్ మ్యాచ్‌లో, ఆమె, దీప్తి శర్మ కలిసి రికార్డు స్థాయిలో 320 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పగా, పూనమ్ చిరస్మరణీయమైన 109 పరుగులు చేసింది. ఈ ఇన్నింగ్స్‌ను క్రికెట్ ప్రేమికులు ఎప్పటికీ మరిచిపోలేరు.
Also Read
- 9000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో Honor 700 సిరీస్.. Snapdragon 8 Gen 5 ప్రాసెసర్‌తో ప్రో మోడల్..!
- Pulivarthi Sudha Reddy: ఈ రోజు అంతా నీ వెంటే.. చెవిరెడ్డికి పులివర్తి సుధా రెడ్డి వార్నింగ్!
- భారత్‌లోకి Vivo X500 సిరీస్.. 400mm జూమ్‌తో ZEISS టెలిఫోటో లెన్స్‌తో రచ్చ.!
- Ramayana Twitter Review: ఫైట్స్ అదుర్స్.. రణబీర్, యాష్ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ .. 'రామాయణం' ఫస్ట్ షోపై ఆడియన్స్ టాక్..
వన్డేల్లోనూ పూనమ్ రౌత్ గణాంకాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. 34.83 సగటుతో మొత్తం 2299 పరుగులు చేసిన ఆమె, ఇందులో 3 సెంచరీలు, 15 హాఫ్ సెంచరీలు నమోదు చేసింది. 2009, 2013, 2017 వన్డే ప్రపంచ కప్ టోర్నీలలో ఆమె టీమిండియా తరఫున బరిలో దిగింది. ఇక, 2017 ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ తన కెరీర్లో అత్యంత మధురమైన క్షణాల్లో ఒకటిగా నిలుస్తుందని రౌత్ గుర్తుచేసుకుంది. ఆ ట్రోఫీని తృటిలో కోల్పోయినప్పటికీ, ఆ టోర్నమెంట్లో జట్టు ప్రదర్శన భారత్‌లో మహిళా క్రికెట్ రూపురేఖలను పూర్తిగా మార్చివేసిందని, ఎంతో మంది యువతులకు స్ఫూర్తినిచ్చిందని, మన ఆట భవిష్యత్తును మార్చివేసిందని ఆమె రాసుకొచ్చింది.
టెస్ట్ కెరీర్ విషయానికి వస్తే, పూనమ్ తన తొలి టెస్ట్ మ్యాచ్‌లో డకౌట్ అయ్యి నిరాశపరిచినా, మూడో టెస్ట్‌లోనే అద్భుతమైన పునరాగమనం చేసింది. 2014లో మైసూర్లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో అజేయంగా 130 పరుగులు చేసి సెంచరీ సాధించింది. ఇక టీ20 క్రికెట్లోనూ ఆమె తన వంతు పాత్ర పోషించింది. 27.65 సగటు, 92.17 స్ట్రైక్ రేట్‌తో మొత్తం 719 పరుగులు చేసిన ఆమె, నాలుగు అర్ధశతకాలు సాధించింది. 2009, 2010, 2012, 2014 సంవత్సరాల్లో జరిగిన నాలుగు టీ20 ప్రపంచ కప్ టోర్నీలలో ఆమె ఆడింది. ఇందులో 2009లో పాకిస్థాన్‌పై 54 నాటౌట్‌తో మ్యాచ్ గెలిపించే ఇన్నింగ్స్ ఆడగా, 2014లో వెస్టిండీస్‌పై 52 బంతుల్లో 56 పరుగులు చేసింది. తన క్రికెట్ ప్రయాణానికి పునాది వేసిన డొమెస్టిక్ జట్లను కూడా పూనమ్ ఈ సందర్భంగా గుర్తుచేసుకుంది. తన తొలి రోజుల్లో తనపై నమ్మకముంచిన ముంబై క్రికెట్ అసోసియేషన్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.
తాజావార్తలు
-
AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. చెవిరెడ్డికి పులివర్తి సుధ వార్నింగ్!
-
9000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో Honor 700 సిరీస్.. Snapdragon 8 Gen 5 ప్రాసెసర్‌తో ప్రో మోడల్..!
-
Pulivarthi Sudha Reddy: ఈ రోజు అంతా నీ వెంటే.. చెవిరెడ్డికి పులివర్తి సుధా రెడ్డి వార్నింగ్!
-
భారత్‌లోకి Vivo X500 సిరీస్.. 400mm జూమ్‌తో ZEISS టెలిఫోటో లెన్స్‌తో రచ్చ.!
-
Ramayana Twitter Review: ఫైట్స్ అదుర్స్.. రణబీర్, యాష్ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ .. ‘రామాయణం’ ఫస్ట్ షోపై ఆడియన్స్ టాక్..
ట్రెండింగ్
-
Motorola నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్.. Snapdragon 8 Gen 5 చిప్సెట్, 12GB RAMతో రీఎంట్రీకి సిద్దమవుతున్న Moto One సిరీస్..!
-
Nissan Festive Offers: కార్లపై బంపర్ ఆఫర్.. రూ.86 వేల విలువైన CNG కిట్ ఫ్రీ.. అప్పటి వరకు మాత్రమే..!
-
కొత్త లుక్‌లో Volkswagen Virtus Facelift.. లాంచ్‌కు సిద్ధం..!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 711 కి.మీ ప్రయాణం.. Mercedes-Benz కొత్త ఎలక్ట్రిక్ SUV లాంచ్..!
-
WBBL 2026: కీపర్ ‘నో బాల్’ బ్లండర్.. పొరపాటుతో తారుమారైన మ్యాచ్ రిజల్ట్.. రెనెగేడ్స్‌ను వరించిన అదృష్టం.!