Zimbabwe Celebrations: జింబాబ్వే దెబ్బకు ఆసీస్ అబ్బా! సెలబ్రేషన్ మాములుగా లావుగా.. వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Zimbabwe Celebrations: జింబాబ్వే క్రికెట్ జట్టు ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో సూపర్ 8 దశకు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయంపై జట్టు కెప్టెన్ సికందర్ రాజా తాజాగా స్పందించాడు. ఈ విజయం పట్ల తాను ఎంతో వినమ్రంగా, కృతజ్ఞతతో ఉన్నానని చెప్పుకొచ్చారు. మా జట్టు లక్ష్యం కేవలం సూపర్ 8కు చేరుకోవడం మాత్రమే కాదని.. ప్రపంచ వేదికపై జింబాబ్వేకు మరింత గుర్తింపు, గౌరవం తీసుకురావడమే ప్రధాన ఉద్దేశమని అన్నాడు.
PAK Playing XI vs NAM: నమీబియాతో మ్యాచ్.. పాకిస్థాన్ ప్లేయింగ్ ఎలెవన్‌పై హై డ్రామా!
Also Read
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
- Women's T20 World Cup 2026 : పాకిస్తాన్‌ను చిత్తు చేసిన భారత్.. దీప్తి శర్మ ఐదు వికెట్ల సునామీ.!
ఓమాన్‌పై విజయం, 2021 చాంపియన్ ఆస్ట్రేలియాపై అద్భుత ప్రదర్శన, అలాగే ఐర్లాండ్‌తో మ్యాచ్ వర్షం కారణంగా రద్దవ్వడం వంటి ఫలితాల నేపథ్యంలో జింబాబ్వే మొదటిసారి సూపర్ 8 దశకు చేరింది. దీనితో గ్రూప్ Bలో ఐర్లాండ్, ఆస్ట్రేలియా టోర్నమెంట్ నుంచి నిష్క్రమించాయి. ఇకపోతే 2007 నుంచి 2016 వరకు ప్రతి టి20 ప్రపంచకప్‌లో గ్రూప్ దశలోనే జింబాబ్వే నిష్క్రమించింది. 2021, 2024 ఎడిషన్లకు అర్హత సాధించలేకపోయింది. 2022లో సూపర్ 12 దశకు చేరినా, 12వ స్థానంతో ముగించింది. 1999 వన్డే ప్రపంచకప్‌లో ఐదో స్థానం జింబాబ్వేకు ఇప్పటివరకు ఉన్న ఉత్తమ ఫలితం.
శ్రీలంకలో మ్యాచ్‌లు ఆడుతున్న సమయంలో అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరుకావడం తమకు అదనపు ఉత్సాహాన్నిచ్చిందని కెప్టెన్ రజా పేర్కొన్నారు. జింబాబ్వే క్రికెట్‌పై ప్రజలకు మళ్లీ నమ్మకం కలిగింది. మా ఆటతీరు వాళ్లలో ఆశను నింపిందని అన్నారు. అభిమానులు, మీడియా, దేశ ప్రజలందరూ ఒకటిగా నిలిస్తే జింబాబ్వే మరింత విజయాలు సాధించగలదని విశ్వాసం వ్యక్తం చేసాడు. సూపర్ ఎయిట్‌కు అర్హత సాధించడం ఒక ‘టిక్క్ ఇన్ ది బాక్స్’ మాత్రమేనని.. కానీ పూర్తి లక్ష్యం ఇంకా ముందుందని రజా స్పష్టం చేశారు.
Amazon Logo Mehndi: అమెజాన్ లో చిగురించిన ప్రేమ.. పెళ్లిలో చేతిపై ఐకానిక్ స్మైల్ లోగోతో వధువు
ఇక ఐర్లాండ్ తో జరగాల్సిన వర్షం కారణంగా ఆట రద్దవడంతో జింబాబ్వే అభిమానులు పాటలు పాడుతూ సంబరాలు చేసుకున్నారు. అయితే ఈ సంబరాల్లో కేవలం అభిమానులే కాదు.. జట్టు ఆటగాళ్లు కూడా పాడుతూ ఎంజాయ్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. కెప్టెన్ రాజాతో పాటు ఆటగాళ్లు, సిబ్బంది, అభిమానులు కూడా పాటలు పాడుతూ వారి ఆనందాన్ని పంచుకున్నారు.
Sikandar Raza & Zimbabwe Team Celebration After Qualifying for Super 8s. #T20WorldCup pic.twitter.com/b8VbMGyHzZ
— Nibraz Ramzan (@nibraz88cricket) February 17, 2026
తాజావార్తలు
-
Allahabad High Court: హిజాబ్ ధరించడం ఇస్లాంలో తప్పనిసరి కాదు..! అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు..
-
Sri Gouri Priya: తమిళ ప్రేక్షకుల మనసు గెలిచిన తెలుగు అమ్మాయి.. శ్రీ గౌరీ ప్రియ సక్సెస్ వెనుక అసలు కథ ఇదే!
-
CSK Head Coach: ఎంఎస్ ధోనీ వద్దు.. సీఎస్కేకు ఆ టీమిండియా స్టారే పర్ఫెక్ట్ కోచ్!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Gurmeet Ram Rahim Release: మరోసారి జైలు నుంచి బయటకు డేరా బాబా.. 17వ సారి పెరోల్‌పై విడుదల
ట్రెండింగ్
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్‌ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?