Kohli vs Gambhir: విరాట్ కోహ్లీ, గంభీర్ మధ్య విభేదాలు.. బీసీసీఐ కార్యదర్శి క్లారిటీ

  • విరాట్ కోహ్లీ, గంభీర్ మధ్య విభేదాలు..
  • ఇద్దరు మధ్య విభేదాలు లేవని చెప్పిన బీసీసీఐ..
  • కోహ్లీ- గంభీర్ మధ్య స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయి: దేవజిత్ సైకియా
Kohli

Kohli

Kohli vs Gambhir: 2027 వన్డే వరల్డ్ కప్‌ను దృష్టిలో పెట్టుకుని విరాట్ కోహ్లీ స్థానంలో యువ ఆటగాడిని తీసుకురావాలనే ఆలోచనలో జట్టు మేనేజ్‌మెంట్ ఉందన్న ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో గత కొంత కాలంగా టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మధ్య విభేదాలు బయటకు వచ్చాయి. అయితే, ఈ ఊహాగానాలను బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా పూర్తిగా తోసిపుచ్చారు. కోహ్లీ- గంభీర్ మధ్య ఎంతో స్నేహపూర్వక సంబంధాలను కలిగి ఉన్నారని స్పష్టం చేశారు. నేను ఎప్పుడూ వారిద్దరూ గొడవపడినట్లు చూడలేదు.. దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సమయంలో నేను వారితోనే ఉన్నాను.. వారి మధ్య మంచి సంబంధాలే ఉన్నాయని తేల్చి చెప్పారు.

Read Also: Cyber Sextortion: రిటైర్డ్ ఇంజనీర్‌పై వలపు వల.. రూ.4 కోట్లు నొక్కేసిన కిలాడీ

కాగా, ఇటీవలి కాలంలో భారత జట్టు వన్డే ఫార్మాట్‌లో మార్పులకు బీసీసీఐ శ్రీకారం చుట్టింది. ఆస్ట్రేలియా పర్యటనకు ముందు రోహిత్ శర్మ స్థానంలో శుభ్‌మన్ గిల్‌ను వన్డే కెప్టెన్‌గా నియమించింది. అలాగే, వచ్చే వన్డే వరల్డ్ కప్‌లో ఆడే అంశంపై రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరూ ఇప్పటివరకు స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ వెల్లడించారు. అలాగే, కోహ్లీ- రోహిత్ జోడీ తమ ఆటను మరింత మెర్చుకుంటున్నారు. ఇటీవల జరిగిన విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో వీరిద్దరూ పాల్గొని మంచి ప్రదర్శన కనబరిచారు. ఆ టోర్నీ అనుభవం వారికి ఎంతో ఉపయోగపడిందని, ఆ తర్వాత దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌లతో జరిగిన వన్డే సిరీస్‌ల్లో ఇద్దరూ అద్భుత ఫామ్‌లో కనిపించారని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా చెప్పారు.

Read Also: Sanju Samson: రెండు ప్రపంచకప్‌లు, 10 మ్యాచ్‌లు.. సంజు శాంసన్ ఎన్ని రన్స్ చేశాడంటే?

కోహ్లీని జట్టు నుంచి తప్పించే ప్రయత్నాలు?
విరాట్ కోహ్లీని జాతీయ జట్టునుంచి పక్కన పెట్టేందుకు బీసీసీఐ లేదా జట్టు మేనేజ్‌మెంట్ ప్రయత్నిస్తోందన్న ప్రచారంపైనా దేవజిత్ సైకియా స్పందించారు. కోహ్లీ స్థాయిలో ఉన్న ఆటగాడిని ఎవ్వరూ బలవంతంగా నిర్ణయం తీసుకునేలా చేయలేరని స్పష్టం చేశారు. గత నెలలుగా కోహ్లీ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు.. చివరి ఏడు వన్డే ఇన్నింగ్స్‌ల్లో 616 పరుగులు చేశాడు. 123.2 సగటుతో పాటు 108.64 స్ట్రైక్‌రేట్‌ను నమోదు చేయగా.. ఇందులో మూడు శతకాలు, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. భారత జట్టు జూలై 2026లో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనున్న వన్డే సిరీస్‌లో విరాట్ కోహ్లీ మళ్లీ మైదానంలో కనిపించనున్నాడు.