T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌లో అమెరికా ఆల్‌టైమ్ రికార్డు.. టీమిండియాకు కూడా సాధ్యం కాలేదు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Highest targets succesfully chased in T20 World Cups: టీ20 ప్రపంచకప్‌లో అమెరికా చరిత్ర సృష్టించింది. పొట్టి టోర్నీ చరిత్రలో మూడో అత్యధిక ఛేదన సాధించిన జట్టుగా యూఎస్ చరిత్రకెక్కింది. డల్లాస్ వేదికగా ఆదివారం ఉదయం కెనడాతో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించడంతో ఈ రికార్డు యూఎస్ ఖాతాలో చేరింది. కెనడా నిర్ధేశించిన 195 పరుగుల లక్ష్యాన్ని అమెరికా 17.4 ఓవర్లలో 3 వికెట్స్ కోల్పోయి ఛేదించింది. యూఎస్ విజయంలో ఆండ్రిస్ గౌస్ (65; 46 బంతుల్లో 7×4, 3×6), ఆరోన్ జోన్స్ (94; 40 బంతుల్లో 4×4, 10×6) కీలక పాత్ర పోషించారు.
టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక ఛేదన చేసిన జట్టుగా ఇంగ్లండ్ ఉంది. 2016లో వాంఖడే స్టేడియంలో దక్షిణాఫ్రికాపై 230 పరుగుల టార్గెట్ ఛేదించింది. 2007లో జోబర్గ్ వేదికగా వెస్టిండీస్‌పై దక్షిణాఫ్రికా 206 రన్స్ ఛేదించింది. తాజాగా కెనడాపై యూఎస్ 195 పరుగుల లక్ష్యాన్ని సులువుగా ఛేదించింది. ఈ రికార్డు టీమిండియాకు కూడా సాధ్యం కాలేదు. ఇక యూఎస్ఏ తరఫున అత్యధిక భాగస్వామ్యం ఈ మ్యాచ్‌లో నమోదైంది. అమెరికా తరఫున ఏ వికెట్‌కైనా జోన్స్-గోస్ సాధించిన 131 పరుగులే అత్యధిక భాగస్వామ్యం. అంతకుముందు ఈ రికార్డు మోడానీ-గజనాధ్ (110) పేరిట ఉంది.
Also Read
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
- Women's T20 World Cup 2026 : పాకిస్తాన్‌ను చిత్తు చేసిన భారత్.. దీప్తి శర్మ ఐదు వికెట్ల సునామీ.!
Also Read: Rohit Sharma-Fan: ప్లీజ్ ఏమనొద్దు.. పోలీసులకు రోహిత్ శర్మ రిక్వెస్ట్ (వీడియో)!
టీ20లలో అత్యధిక లక్ష్యాన్ని యూఎస్ ఈ మ్యాచ్‌లోనే ఛేదించింది. అంతకుముందు 2024లోనే కెన్ హ్యూస్టన్‌లో 169 రన్స్ ఛేదించింది. 2022లో 155 రన్స్, 2024లో 154 పరుగులను యూఎస్ ఛేదించింది. ఇక టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక ఓవర్ రన్ రేటుతో పరుగులు సాధిస్తూ.. సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేసిన జోడీగా ఆరోన్ జోన్స్-ఆండ్రీ నిలిచారు. వీరిద్దరు 14.29 రన్ రేటుతో పరుగులు చేశారు.
తాజావార్తలు
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్‌లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
-
OTR : కష్టాలు మావి, క్రెడిట్ వాళ్లదా.. భోగాపురం వేడుకలో టీడీపీ నేతల అసంతృప్తి
-
Mohan Bhagwat: రిజర్వేషన్లు కొనసాగాలి, వారు వదులుకోవాలి: ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!