IND vs PAK T20 World Cup 2024: భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌కు ఉగ్రముప్పు.. ఆందోళనలో ఫాన్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Terror Threat To Ind vs Pak Match in T20 World Cup 2024: మరో మూడు రోజుల్లో వెస్టిండీస్, యూఎస్ వేదికలుగా టీ20 ప్రపంచకప్ 2024 ఆరంభం కానుంది. జూన్ 2న మెగా టోర్నీ ఆరంభం కానుండగా.. జూన్ 5న భారత్ తన తొలి మ్యాచ్ ఆడుతుంది. ఇక క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూసే భారత్, పాకిస్తాన్ మ్యాచ్ న్యూయార్క్ వేదికగా జూన్ 9న జరగనుంది. ఈ మ్యాచ్‌కు ఉగ్ర ముప్పు పొంచి ఉన్నట్టు తెలుస్తోంది. మూడు వారాల క్రితమే ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధాని సైతం ఈ విషయంలో ఆందోళన వ్యక్తం చేశారు.
భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌కు ముష్కర ముఠాలు ముప్పు తలపెట్టనున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఓ ఉగ్ర ముఠా చేసిన పోస్ట్ ఇందుకు కారణం. ‘మీరు టీ20 ప్రపంచకప్ 2024 మ్యాచ్‌ల కోసం వేచి చూస్తున్నారు. మేము మీకోసమే ఎదురుచూస్తున్నాం’ అని ఓ ఓ ఉగ్ర ముఠా పోస్ట్ చేసింది. దానికి ఓ వ్యక్తి ఆయుధాలు ధరించి ఉన్న ఫొటోను షేర్ చేసింది. అంతేకాదు ‘నసావు స్టేడియం.. 09/06/2024’ అని కూడా ఆ పోస్టులో రాసుంది. దాంతో దాయాదుల మ్యాచ్‌కు ఉగ్రముప్పు ఉందనే వార్తలు అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది.
Also Read
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
- Women's T20 World Cup 2026 : పాకిస్తాన్‌ను చిత్తు చేసిన భారత్.. దీప్తి శర్మ ఐదు వికెట్ల సునామీ.!
Also Read: Ambati Rayudu: అంబటి రాయుడు కుటుంబానికి అత్యాచారం, హత్య బెదిరింపులు!
ఈ ఉగ్రముప్పుపై ఐసీసీ, న్యూయార్క్ గవర్నర్ ఆఫీస్ స్పందించింది. ప్రజా భద్రతకు ఎలాంటి ఇబ్బంది లేదని, ప్రశాంతంగా టీ20 ప్రపంచకప్ 2024 మ్యాచ్‌లను నిర్వహించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది. ‘న్యూయార్క్ పోలీస్‌కు ఇప్పటికే అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చాం. అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి భద్రతను కట్టుదిట్టం చేస్తాం. ప్రజల భద్రతే మాకు ముఖ్యం. మ్యాచ్‌లను అందరూ ఆస్వాదించేలా నిర్వహిస్తాం’ అని న్యూయార్క్ గవర్నర్ కాతీ హోచుల్ తెలిపారు. ప్రపంచకప్ 2024ని సురక్షితంగా నిర్వహించేందుకు కఠిన చర్యలు తీసుకున్నాం, ప్రతి ఒక్కరి భద్రతే తమకు ముఖ్యం అని ఐసీసీ అధికారులు చెప్పారు.
తాజావార్తలు
-
DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుపై కీలక అప్డేట్..
-
CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
-
Chennai Love Story Trailer: కిరణ్ అబ్బవరం ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్ చూశారా!
-
IND Vs ENG 3rd ODI: లార్డ్స్ ఫైనల్ ఫైట్.. సుందర్ స్థానంలో యువ సంచలనానికి లక్కీ ఛాన్స్..
-
Aakash Chopra: కుల్దీప్ యాదవ్‌ను ఎందుకు బలిపశువును చేస్తున్నారు.. మాజీ క్రికెటర్ సూటి ప్రశ్న..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్‌పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్‌కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!