Site icon NTV Telugu

Ashwin on Sanju: రెండు కోణాల్లో చూడాలి.. సంజూ బ్యాటింగ్ పై అశ్విన్ కీలక వ్యాఖ్యలు!

Ashwin On Sanju

Ashwin On Sanju

Ashwin on Sanju: టీ20 వరల్డ్ కప్‌ 2026లో భాగంగా భారత్ జింబాబ్వేపై భారీ విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌ గా సంజూ శాంసన్‌కు అవకాశం లభించింది. ప్లేయింగ్ XIలో రింకూ సింగ్ స్థానంలో వచ్చిన శాంసన్, అభిషేక్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించాడు. 15 బంతుల్లో 24 పరుగులు చేసి టీమ్‌కు మంచి ఆరంభాన్ని అందించాడు. అతని స్ట్రైక్ రేట్ టీమ్‌కు మొదటి మంచి మోమెంటమ్ ఇచ్చింది.

Earthquake In Kolkata: వణికిన కోల్‌కతా.. బంగ్లాదేశ్‌ కేంద్రంగా 5.4 తీవ్రతతో భూకంపం!

ఇక మ్యాచ్ ముగిసిన తర్వాత టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో సంజూ శాంసన్ ప్రదర్శనపై విశ్లేషణ చేశాడు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. నేను దీనిని రెండు కోణాల్లో చూస్తాను. ఒకటి నాకు తెలిసిన సంజూ శాంసన్ వ్యక్తిత్వం, అతని సామర్థ్యం. రెండోది భారత జట్టులో అతని పాత్ర. ఈ వరల్డ్ కప్‌లో ఓపెనింగ్ భాగస్వామ్యం పై ఈ మ్యాచ్‌ లో స్పష్టత వచ్చింది. జట్టుకు మంచి ఆరంభం లభించింది. సంజూ 15 బంతుల్లో 28 లేదా 16 బంతుల్లో 30 పరుగులు చేస్తే.. ఫైనల్ వరకు అదే కొనసాగిస్తే, అతను తన పని చేసినట్టే.. అని అశ్విన్ అన్నాడు.

360° స్పేషల్ ఆడియో, బోస్ సౌండ్ టెక్నాలజీతో ప్రీమియం ఆడియో అనుభవం.. Noise Master Buds 2 లాంచ్.!

అశ్విన్ మరింతగా మాట్లాడుతూ.. శాంసన్ భారీ ఇన్నింగ్స్ ఆడాలని తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. సంజూ వ్యక్తిగా నాకు ఇష్టం. అతను ఒక పెద్ద స్కోర్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇంత మంచి వేదిక అతనికి మళ్లీ రాకపోవచ్చు. మంచి ఆరంభాన్ని పెద్ద ఇన్నింగ్స్‌ గా మార్చుకోవాలి.. ఇన్ని సంవత్సరాల కష్టానికి ఇది సరైన సమయమని అన్నాడు. కనీసం ఒక సెంచరీ లేదా మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌ తో వరల్డ్ కప్ ముగిస్తే.. అతని ఆత్మవిశ్వాసానికి ఎంతో ఉపయోగపడుతుందని అన్నాడు. దానికి అందుకు అర్హుడు అని అశ్విన్ వ్యాఖ్యానించాడు. ఇక సూపర్ 8లో చివరి మ్యాచ్ మార్చి 1న వెస్టిండీస్ తో ఆడనుంది. ఈ మ్యాచ్ ఇరుజట్లకూ డూ ఆర్ డై మ్యాచ్. ఈ మ్యాచ్ లో ఎవరు గెలిస్తే వారు సెమిస్ లో అడుగు పెడతారు

Exit mobile version