T20 World Cup 2026: ‘‘నీకు వసీం అక్రం, షేర్ వార్న్‌లను ఇచ్చినా వేస్ట్’’.. పాక్ కెప్టెన్‌పై మాజీల ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
T20 World Cup 2026: T20 ప్రపంచకప్ 2026 నుంచి పాకిస్తాన్ ఘోరంగా నిష్క్రమించడం ఆ దేశంలో మాజీల ఆగ్రహానికి కారణమైంది. పాక్ క్రికెట్ అభిమానులు కూడా పాకిస్తాన్ ఆటతీరుపై విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘాపై విమర్శలు దాడి ఎక్కువైంది. తాజాగా ఆ దేశ మాజీ వికెట్ కీపర్ రషీద్ లతీఫ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో గెలిచినప్పటికీ, నెట్ రన్ రేట్ కారణంగా పాకిస్తాన్ సెమీఫైనల్స్ కు వెళ్లకుండా టోర్నీ నుంచి అవుట్ అయింది.
Read Also: Israel-Iran War: యుద్ధంలో తీవ్ర విషాదం.. ఒకే చోట 165 మంది విద్యార్థినుల అంత్యక్రియలు..
Also Read
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
- Women's T20 World Cup 2026 : పాకిస్తాన్‌ను చిత్తు చేసిన భారత్.. దీప్తి శర్మ ఐదు వికెట్ల సునామీ.!
ఈ ఓటమి తీరుపై రషీద్ లతీఫ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘాకు వసీం అక్రమ్, వకార్ యూనస్, షోయబ్ అక్తర్, షేన్ వార్న్ వంటి దిగ్గజ బౌలర్లను ఇచ్చినా వేస్ట్ అని, అయినా కూడా మ్యాచ్‌ను ఓడించగలడు’’ అని ఎద్దేవా చేశారు. బౌలర్లను ఉపయోగించడంలో కెప్టెన్ దారుణంగా విఫలమయ్యాడని, వ్యూహాత్మక లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అన్నారు.
సెమీ ఫైనల్స్‌కు వెళ్లాంటే శ్రీలంకను 147 పరుగుల్లోపు కట్టడి చేయాలి. కానీ ఒకానొక దశలో శ్రీలంక విజయం సాధిస్తుందా? అనేలా ఆడింది. పాక్ బౌలర్లు ఏకంగా 207 పరుగులు సమర్పించుకున్నారు. శ్రీలంక కెప్టెన్ శనక 31 బంతుల్లో ఏకంగా 76 రన్స్ చేసి పాక్ ఆశలపై నీళ్లు చల్లాడు. నసీమ్ షా వంటి ప్రధాన బౌలర్‌నుు డెత్ ఓవర్ల కోసం దాచకపోవడం, స్పిన్నర్లను సరైన టైమ్‌లో బౌలింగ్‌కు దించకపోవడం వంటి తప్పులను లతీఫ్ ఎత్తిచూపారు. హెడ్ కోచ్ మైక్ హెసన్ , ఇతర సహాయక సిబ్బందిపై కూడా లతీఫ్ విమర్శలు గుప్పించారు. బ్యాటింగ్ ఆర్డర్‌లో పదేపదే ప్రయోగాలు చేయడం వల్ల జట్టు నష్టపోయిందని అన్నారు. కోచ్‌లు కూడా పాక్ ఆటతీరు దారుణంగా ఉండటానికి ఒక కారణమని మండిపడ్డారు.
తాజావార్తలు
-
Operation Sindoor: పాక్ అణుకేంద్రం ‘‘కిరాణా హిల్స్’’పై దాడి.. సంచలన నిజం చెప్పిన మాజీ CDS..
-
Rahul Gandhi: కృతి సనన్ రక్షాబంధన్ యాడ్‌పై కంగనా విమర్శలు.. ఆమె ఇష్టమని రాహుల్‌గాంధీ మద్దతు
-
IISc Study: ఆవు ఎంజైమ్‌తో ప్రమాదకర బ్యాక్టీరియాకు చెక్.. IISc సంచలన పరిశోధన
-
Romanchakam Trailer: సందీప్ రెడ్డి వంగా ప్రెజెంట్స్.. ‘రోమాంచకం’ ట్రైలర్లో ఏదో గట్టిగానే ఉంది!
-
Telangana Sports : గాయత్రి-త్రిసాకు సీఎం రేవంత్ అభినందనలు.. గోపీచంద్‌తో స్పెషల్ మీట్
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!