Mohammed Siraj: నేడు హైదరాబాద్‌లో మహమ్మద్ సిరాజ్ రోడ్ షో.. ఫుల్ డీటెయిల్స్ ఇవే!
- అడుగడుగునా ఘనస్వాగతం
- వాంఖడేలో ఉద్వేగభరిత వాతావరణం
- హైదరాబాద్‌లో సిరాజ్ రోడ్ షో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mohammed Siraj Road Show in Hyderabad Today: టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి విజేతగా నిలిచిన భారత జట్టు.. కాస్త ఆలస్యంగా గురువారం (జులై 4) స్వదేశానికి చేరుకుంది. 13 ఏళ్ల తర్వాత ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడి.. స్వదేశానికి తిరిగొచ్చిన భారత జట్టుకు ఢిల్లీ నుంచి ముంబై వరకు అడుగడుగునా ఘనస్వాగతం లభించింది. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమైన అనంతరం ముంబైకి వచ్చిన టీమిండియా.. ‘వన్స్ ఇన్ ఎ లైఫ్ టైమ్ మూవ్‌మెంట్’ను ఆస్వాదించింది. భారత విజయోత్సవ ర్యాలీకి అరేబియా తీరం జన సంద్రమైంది. అభిమానులు తమ క్రికెటర్లపై పూల వర్షం కురిపిస్తూ.. భారత్ మాతాకీ జై, జయహో భారత్, వందేమాతరం నినాదాలతో హోరెత్తించారు.
విజయయాత్ర అనంతరం భారత ఆటగాళ్లు వాంఖడే స్టేడియానికి చేరుకున్నారు. అభిమానులతో స్టేడియం మొత్తం నిండిపోగా.. వేలాది మంది బయట ఉండిపోయారు. వర్షం కురుస్తున్నా కూడా ఫ్యాన్స్ స్టేడియంలోనే ఉండి తమ ఆనందాన్ని పంచుకున్నారు. భారత జట్టు స్లేడియం చేరుకున్నాక జాతీయ గీతం ఆలపించారు. ఆ సమయంలో ఉద్వేగభరిత వాతావరణం నెలకొంది. తమకు మద్దతుగా నిలిచిన అభిమానులకు భారత జట్టు మొత్తం స్టేడియం చుట్టూ తిరుగుతూ అభినందనలు తెలిపింది. ఇక టీ20 ప్రపంచకప్ గెలిచిన రోహిత్ సేనకు బీసీసీఐ రూ.125 కోట్ల భారీ నజరానాను అందించింది.
Also Read
- India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
Also Read: Virat Kohli: ఇప్పుడు ఆ ఫీలింగ్ వస్తోంది: విరాట్ కోహ్లీ
భారత జట్టు విశ్వవిజేతగా నిలవడంలో తనవంతు పాత్ర పోషించిన హైదరాబాద్ పేసర్ మహమ్మద్ సిరాజ్ ఈరోజు తన ఇంటికి రానున్నాడు. ఈ నేపథ్యంలో సిరాజ్‌కు గ్రాండ్ వెల్‌కమ్ చెప్పడానికి భాగ్యనగర అభిమానులు సిద్ధమయ్యారు. గురువారం హైదరాబాద్‌లో భారీ రోడ్ షో నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని సిరాజ్ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వెల్లడించాడు. ‘ముంబైలో జరిగిన విజయోత్సవ ర్యాలీని హైదరాబాద్‌లో రీక్రియేట్ చేస్తున్నాం. జులై 5న సాయంత్రం 5.30 గంటలకు రోడ్ షో మొదలవుతుంది. మెహిదీపట్నంలోని సరోజని ఐ హాస్పటల్ నుంచి ఈద్గా మైదానం వరకు రోడ్ షో కొనసాగుతుంది. హైదరాబాద్‌లో కలుద్దాం’ అని సిరాజ్ పేర్కొన్నాడు. ప్రపంచకప్‌లో సిరాజ్ గ్రూప్ స్టేజ్ వరకు మాత్రమే తుది జట్టులో కొనసాగాడు. విండీస్ పిచెస్ స్పిన్‌కు అనుకూలంగా ఉండడంతో మనోడికి చోటు దక్కలేదు. దాయాది పాకిస్థాన్‌పై భారత్ విజయం సాధించడంలో సిరాజ్ కీలక పాత్ర పోషించాడు.
తాజావార్తలు
-
Trump-Jinping: ఇరాన్‌కు సాయపడడం భావ్యం కాదు.. జిన్‌పింగ్‌కు ట్రంప్ హితవు
-
New Scheme: NPS పెన్షన్‌లో ఇప్పుడు ఆరోగ్య బీమా కూడా.. ఫ్యామిలీ మొత్తానికి వర్తింపు.. అక్టోబర్ 1 నుంచే అమల్లోకి..
-
Jaishankar: జైశంకర్ మళ్లీ వేసేశాడు.. పాక్ జర్నలిస్ట్‌కు ఘాటు కౌంటర్!
-
Bill Gates: ఏఐతో బిలియన్ మంది ప్రాణాలు పోయే ప్రమాదం! బిల్ గేట్స్ తీవ్ర హెచ్చరిక
-
Houthi War: సౌదీకి పాకిస్తాన్ దూరం.. అండగా నిలుస్తున్న ఫ్రాన్స్!
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!