T20 World cup 2024 : తొలిసారి ఐసీసీ ఫైనల్స్ కు చేరిన దక్షిణాఫ్రికా..
- టీ20 క్రికెట్ ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా చరిత్ర సృష్టించింది.
- తొలిసారి ఆ జట్టు ఫైనల్స్ చేరింది.
- ఈరోజు రాత్రి ఇంగ్లాడ్ - భారత్ మధ్య జరిగే సెమీఫైనల్స్ మ్యాచ్‌లో విజేతతో దక్షిణాఫ్రికా ఫైనల్స్ ఆడనుంది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
T20 World cup 2024 : టి20 వరల్డ్ కప్ 2024 లో భాగంగా నేడు జరిగిన మొదటి సెమి ఫైనల్లో దక్షిణాఫ్రికా (South Africa) , ఆఫ్ఘనిస్తాన్ (Afghanistan) తరౌబ వేదికగా తలపడ్డాయి. ఈ మ్యాచ్లో మొదట ఆఫ్ఘనిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ చేయగా కేవలం 11.5 ఓవర్లలో 56 పరుగులకు కుప్ప కూలింది. దింతో దక్షిణాఫ్రికా బౌల్లర్స్ దెబ్బకి ఆఫ్ఘనిస్తాన్ ఏ పరిస్థితుల్లో కూడా ఎదురుకోలేకపోయింది. ఇక మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్స్ లో ఒక్కరు మాత్రమే రెండు అంకెల స్కోరుని చేరుకున్నాడు. ఒమార్జై ఒక్కడే 10 పరుగులను చేసి అవుట్ అవ్వగా.. ఇన్నింగ్స్ లో ఎక్స్ట్రాలు 13 అత్యధిక స్కోర్ గా ఉంది. అంటే ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్స్ అంత కలిపి కేవలం 43 పరుగులు మాత్రమే చేసారు. ఈ ఇన్నింగ్స్ లో ముగ్గురు బ్యాట్స్మెన్స్ డక్ అవుట్ అయ్యారు. ఇక మరోవైపు దక్షిణాఫ్రికా బౌలర్లు విషయానికి వస్తే.. మార్కో జాన్సెన్, తబ్రైజ్ శంసిలు చెరో మూడు వికెట్లు.. కాగిసో రబడా, అన్రిచ్ నోర్ట్జే చెరో రెండు వికెట్లు తీసుకొని ఆఫ్ఘనిస్తాన్ పతనానికి కారణం అయ్యారు.
Kalki 2898 AD – Devara : కల్కి లో దేవర.. ఉహించనేలేదుగా..
Also Read
- India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
ఇక తక్కువ స్కోర్ టార్గెట్ చేసేందుకు బ్యాటింగ్ కు దిగిన దక్షిణాఫ్రికా కేవలం 8.5 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 60 పరుగులతో మొదటిసారి ఐసీసీ టోర్నమెంట్లో ఫైనల్ కు చేరుకుంది. మ్యాచ్లో కేవలం 16 పరుగులు ఇచ్చి మూడు టికెట్లు తీసుకున్న మార్కో జాన్సన్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది. దక్షిణాఫ్రికా బ్యాటింగ్ లో డికాక్ కేవలం 5 పరుగులు చేసి వెనుతిరిగిగ మిగతా లాంచనాన్ని హెన్రిక్స్, దక్షిణాఫ్రికా కెప్టెన్ దక్షిణాఫ్రికా కెప్టెన్ మార్కమ్ పూర్తి చేశారు. ఆఫ్ఘనిస్తాన్ బౌల్లర్స్ లో ఫరుకి ఒక వికెట్ సాధించాడు. టీ20 క్రికెట్ ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా చరిత్ర సృష్టించింది. తొలిసారి ఆ జట్టు ఫైనల్స్ చేరింది. 2007లో మొదటి టీ20 ప్రపంచకప్ దక్షిణాఫ్రికా వేదికగా జరగ్గా.. ఆ సంవత్సరం భారత్ ఛాంపియన్‌గా నిలిచింది. ఇప్పటివరకు 8 సార్లు టీ20 ప్రపంచకప్ జరగ్గా దక్షిణాఫ్రికా ఒక్కసారి కూడా ఫైనల్స్ చేరుకోలేదు. 2024లో సెమీఫైనల్స్‌లో ఆప్ఘానిస్తాన్‌పై ఘన విజయం సాధించి ఫైనల్స్ చేరింది. ఈరోజు రాత్రి ఇంగ్లాడ్, భారత్ మధ్య జరిగే రెండో సెమీఫైనల్స్ మ్యాచ్‌లో విజేతతో దక్షిణాఫ్రికా ఫైనల్స్ ఆడనుంది.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!