NTV Telugu Site icon

Virat – SKY : ఆ విషయంలో అప్పుడే కోహ్లీ రికార్డును సమం చేసిన సూర్య..

Sky Virat

Sky Virat

Virat Kohli – Surya Kumar Yadav : 2024 టీ20 ప్రపంచకప్‌లో భాగంగా గురువారం అఫ్గానిస్థాన్‌తో జరిగిన సూపర్ 8 దశలో భారత జట్టు విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీ20 లలో ప్రపంచ నెంబర్ 1 బ్యాట్స్‌మెన్ “మిస్టర్ 360″ సూర్య కుమార్ యాదవ్ Surya Kumar Yadav ఈ మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. టాప్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ, పంత్, విరాట్ కోహ్లి ( Virat Kohli) వికెట్స్ కోల్పోయి జట్టు కష్టాల్లో పడిన సమయంలో సూర్య అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్ లో 28 బంతుల్లో 53 పరుగులు చేశాడు. దీంతో ప్రత్యర్థులకు 182 పరుగుల భారీ లక్ష్యాన్ని అందించిన భారత్.. ఆ తర్వాత బౌలర్లు కూడా చెలరేగిపోవడంతో టీమిండియా భారీ విజయాన్ని అందుకుంది. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన సూర్య కుమార్ యాదవ్ కు ” మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌ ” అవార్డును అందుకున్నాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌ లో సూర్యకుమార్ యాదవ్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కడం ఇది 15వ సారి.

JP Nadda: జేపీ నడ్డాకు మరో కీలక పదవి..!

ఇక టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ రికార్డును తాజాగా సూర్య సమం చేసాడు. ఇప్పటి వరకు కొహ్లీ కూడా 15 సార్లు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులను గెలుచుకున్నాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యధికంగా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును గెలుచుకున్న ఆటగాళ్ల జాబితాలో కోహ్లీతో పాటు సూర్య ప్రస్తుతం అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ఇద్దరూ ఇప్పటివరకు 15 సార్లు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌’ గా ఎంపికయ్యారు. ఇప్పటి వరకు విరాట్ కోహ్లీ మొత్తం 113 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఇకపోతే కేవలం సూర్య కుమార్ యాదవ్ కేవలం 61 మ్యాచ్‌లలో 15 సార్లు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌’ గా ఎంపికయ్యాడు. ఇకపోతే ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ టీ20 విభాగంలో నంబర్ 1 బ్యాట్సమెన్ గా కొనసాగుతున్నారు.

Stock market: భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ఇక 2024 టీ20 ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియా శనివారం సూపర్ 8 లో భాగంగా నార్త్ సౌండ్ లో బాంగ్లాదేశ్ తో అమితుమీ తేల్చుకోనుంది.