NTV Telugu Site icon

Rohit Sharma: నలుగురు స్పిన్నర్లు ఎందుకన్నది చెప్పను: రోహిత్‌ శర్మ

Rohit Sharma Ajit

Rohit Sharma Ajit

Rohit Sharma Said I definitely wanted four spinners in Team India Squad: టీ20 ప్రపంచకప్‌ 2024కు భారత జట్టులో నలుగురు స్పిన్నర్లు కావాలనే విషయంలో జట్టు మేనేజ్‌మెంట్‌ చాలా స్పష్టతతో ఉందని టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తెలిపాడు. జట్టులో నలుగురు స్పిన్నర్లు ఎందుకనే కారణాన్ని ఇప్పుడు చెప్పలేనన్నాడు. నలుగురు స్పిన్నర్ల వెనుక ఉన్న వ్యూహాన్ని యుఎస్‌లో జరిగే మొదటి విలేకరుల సమావేశంలో చెబుతా అని రోహిత్‌ చెప్పాడు. టీ20 ప్రపంచకప్ 2024 కోసం 15 మందితో కూడిన భారత జట్టును మంగళవారం (ఏప్రిల్ 30) బీసీసీఐ ప్రకటించింది. జట్టును ప్రకటించిన రెండు రోజుల తర్వాత సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌ అజిత్‌ అగార్కర్‌, కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

టీ20 ప్రపంచకప్‌ 2024కు నలుగురు స్పిన్నర్లను ఎంపిక చేయడంపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయాని ఓ రిపోర్టర్ అడగ్గా.. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సమాధానం ఇచ్చాడు. ‘ఈ విషయంపై నేను లోతుగా వెళ్లదలచుకోలేదు. జట్టులో నలుగురు స్పిన్నర్లు కావాలని నేను బలంగా కోరుకున్నా. వెస్టిండీస్‌లో మేం చాలా క్రికెట్‌ ఆడాం. మ్యాచ్‌ ఉదయం 10 గంటలకు మొదలవుతుంది. నలుగురు స్పిన్నర్లను ఎంచుకోవడంలో సాంకేతిక కోణం ఉంది. నలుగురు స్పిన్నర్లు ఎందుకన్నది ఇప్పుడే చెప్పను. బహుశా నేను యుఎస్‌లో జరిగే మొదటి విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడిస్తా. నలుగురిలో ఇద్దరు ఆల్‌రౌండర్లు. ఇది జట్టుకు సమతూకాన్నిస్తుంది’ అని రోహిత్‌ చెప్పాడు.

Also Read: Ajit Agarkar: అందుకే సంజూ శాంసన్‌ను ఎంచుకున్నాం: అజిత్ అగార్కర్

మిడిల్‌ ఓవర్లలో జట్టు అవసరాలపై చాలా దృష్టిపెట్టామని రోహిత్‌ శర్మ తెలిపాడు. ‘మేం మిడిల్‌ ఓవర్ల హిట్టింగ్‌పై దృష్టిపెట్టాం. అందుకే శివమ్‌ దూబెను ఎంపిక చేశాం. టాప్‌ ఆర్డర్‌ హిట్టింగ్‌ ఫర్వాలేదు. మరీ అంత పేలవంగా ఏమీ లేదు. ప్రపంచకప్‌ కోసం 2024 15 మంది ఆటగాళ్ల ఎంపిక ప్రక్రియ ఎప్పుడో మొదలైంది. కొన్ని స్థానాల కోసమే ఐపీఎల్‌ 2024 వరకు ఆగాం. మంచి జట్టును ఎంపిక చేశాం’ అని రోహిత్‌ పేర్కొన్నాడు.